తెలుగు న్యూస్ / ఫోటో /
Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్, నరసాపురంలో ఎన్నికల ప్రచారం
- Ys Jagan In Narsapuram: రాబోయే ఐదేళ్లలో పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని, జగన్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని నరసాపురంలో ఓటర్లను సిఎం జగన్ హెచ్చరించారు.
- Ys Jagan In Narsapuram: రాబోయే ఐదేళ్లలో పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని, జగన్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని నరసాపురంలో ఓటర్లను సిఎం జగన్ హెచ్చరించారు.
(1 / 6)
మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని, చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమేనని జగన్ అన్నారు.
(2 / 6)
14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఒక్క మంచి పని చేశారా అని జగన్ ప్రశ్నించారు. బాబు పేరు చెప్తే పేదలకు చేసిన ఒక్క స్కీమ్ గుర్తొస్తుందా? అని నరసాపురంలో ప్రశ్నించారు.
(3 / 6)
రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని.. క్లాస్ వార్ అని, మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో ఎన్నికల్లో వస్తుందని, ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా? అని జగన్ ప్రశ్నించారు.
(4 / 6)
అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ , 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, రాష్ట్రంలో ఉన్న 93శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని జగన్ చెప్పారు.
(5 / 6)
గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చామని, డిబిటి ద్వారా రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశామని, 2లక్షల 31వేల ఉద్యోగాలిచ్చామని నరసాపురంలో చెప్పారు.
ఇతర గ్యాలరీలు