తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - ఆ 2 రోజులు వైన్స్ షాపులు బంద్ - ఎప్పటివరకంటే..?
- హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో పోలీసులు కీలక ఆదేశాలను జారీ చేశారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో అన్ని రకాల వైన్స్, కల్లు, బార్ షాపులను మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

(1 / 5)
వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
(2 / 5)
సెప్టెంబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
(3 / 5)
సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత నిర్ణయం అమల్లో ఉంటుంది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేరిట గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.(image source unsplash.com)
(4 / 5)
ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.(image source unsplash.com)
ఇతర గ్యాలరీలు