తెలుగు న్యూస్ / ఫోటో /
Live Longer। మీ ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే, ఈ ఒక్కటి చాలు!
- Increase Lifespan: నేటి నిశ్చలమైన జీవనశైలి కారణంగా వ్యక్తుల ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇది పెంచుకోవాలనుకుంటే సింపుల్ చిట్కాతో సాధించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు, ఎలాగో చూడండి.
- Increase Lifespan: నేటి నిశ్చలమైన జీవనశైలి కారణంగా వ్యక్తుల ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇది పెంచుకోవాలనుకుంటే సింపుల్ చిట్కాతో సాధించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు, ఎలాగో చూడండి.
(1 / 5)
నడకను చాలా మంది వ్యాయామంగా భావించరు, కానీ నిజానికి ఇది ఎంతో మంచి వ్యాయామం. ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే ఎలా నడవాలో తెలుసుకోండి.
(2 / 5)
ప్రతిరోజూ ఉదయం 11 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రతిరోజూ 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే ఎక్కువ కాలం జీవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
(3 / 5)
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం చురుకైన నడకతో గుండె సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాదు, చురుకైన నడక బహుళ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో సహజంగానే ఆయుష్షు పెరుగుతుంది.
(4 / 5)
నెమ్మదిగా కాకుండా, వేగంగా కాకుండా మితమైన వేగంతో నడవటాన్ని చురుకైన నడక అంటారు. చురుకైన నడక నడిచేటపుడు మాట్లాడాలనుకుంటే నోటి నుంచి శబ్దం రాదు.
ఇతర గ్యాలరీలు