తెలుగు న్యూస్ / ఫోటో /
Virat Kohli T20I Records: టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లి సాధించిన టాప్ 5 రికార్డులు ఇవే
- Virat Kohli T20I Records: అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్లో అతడు సాధించిన టాప్ 5 రికార్డులేవో ఒకసారి చూద్దాం. టీ20 వరల్డ్ కప్ గెలవగానే అతడు ఈ ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
- Virat Kohli T20I Records: అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్లో అతడు సాధించిన టాప్ 5 రికార్డులేవో ఒకసారి చూద్దాం. టీ20 వరల్డ్ కప్ గెలవగానే అతడు ఈ ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
(1 / 6)
Virat Kohli T20I Records: టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా రెండోసారి గెలిచిన వెంటనే టీ20 ఫార్మాట్ నుంచి రిటైరవుతున్న విరాట్ కోహ్లి అనౌన్స్ చేశాడు. ఈ మెగా టోర్నీ అంతా విఫలమైన విరాట్.. ఫైనల్లో మాత్రం 76 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఈ ఫార్మాట్లో అతడు సాధించిన టాప్ 5 రికార్డులు ఏంటో ఒకసారి చూద్దాం.
(2 / 6)
Virat Kohli T20I Records: అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి ప్రస్తుతం టీ20ల్లో 117 ఇన్నింగ్స్ లో 4188 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ తొలి స్థానంలో ఉండగా.. బాబర్ ఆజం మూడో స్థానంలో ఉన్నాడు.
(3 / 6)
Virat Kohli T20I Records: టీ20 వరల్డ్ కప్ లలో అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ కోహ్లి పేరిట ఉంది. అతడు 35 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 33 ఇన్నింగ్స్ ఆడి 1292 రన్స్ చేశాడు. అయితే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
(4 / 6)
Virat Kohli T20I Records: టీ20 వరల్డ్ కప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు రికార్డు కూడా విరాట్ కోహ్లిదే. అతడు 2014లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో 319 రన్స్ చేశాడు. ఆరు మ్యాచ్ లలోనే 106.33 సగటు, 4 హాఫ్ సెంచరీలతో ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం.
(5 / 6)
Virat Kohli T20I Records: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు కూడా విరాట్ కోహ్లి పేరు మీదే ఉంది. అతడు 38 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక సెంచరీలు, హాఫ్ సెంచరీలు కలిపితే 39సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన వరల్డ్ రికార్డు కూడా అతని పేరిట ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో అతడు ఒకే ఒక్క సెంచరీ ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై చేశాడు.
ఇతర గ్యాలరీలు