తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Rains in AP Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
- Rains in AP Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
(1 / 7)
నిన్న నైరుతు బంగాళాఖాతం, ఏపీ దక్షిణ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5. 8 మీటర్ల మధ్య విస్తరించి ఉన్నట్లు వివరించింది. ఈ మేరకు తాజా బులెటిన్ లో వివరాలను పేర్కొంది.
(2 / 7)
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పింది. ఇక సీమ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని అంచనా వేసింది.
(3 / 7)
ఏపీలో ఇవాళ చూస్తే అల్లూరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీసత్యసాయి, వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(4 / 7)
ఇక తెలంగాణలో చూస్తే (అక్టోబర్ 31) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. (image source @APSDMA)
(5 / 7)
రేపు(నవంబర్ 1) ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 7)
నవంబర్ 2వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
ఇతర గ్యాలరీలు