Ugadi Celebrations: తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సీఎం జగన్ ఇంట ఉగాది సంబరాలు
Ugadi Celebrations at CM Jagan Residence: రాష్ట్రవ్యాప్తంగా ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సతీమణి వైఎస్ భారతితో కలిసి ముఖ్యమంత్రి జగన్ వేడుకల్లో పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఉట్టిపడేలా ఉగాది సంబరాలు జరిపారు.
(1 / 8)
ఉగాది వేడుకలకు ముందు ముఖ్యమంత్రి జగన్ దంపతులు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(4 / 8)
నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు.
(5 / 8)
ఉగాది వేళ పంచాంగ శ్రవణం నిర్వహించారు. సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ సంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
(6 / 8)
ముఖ్యమంత్రి జగన్ దంపతులకు టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు ఉగాది పచ్చడిని స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
(7 / 8)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరమంతా ప్రజలకు మంచి జరగాలని ఆకాక్షించిన ముఖ్యమంత్రి జగన్. రైతులకు మేలు జరగాలని.. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఇతర గ్యాలరీలు