తెలుగు న్యూస్ / ఫోటో /
Telegram New Features: టెలిగ్రామ్‍కు కొత్తగా 7 ఫీచర్లు.. ఎలా ఉపయోగపడతాయంటే!
- Telegram New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‍కు కొత్తగా మరో ఏడు ఫీచర్లు యాడ్ కానున్నాయి. టెలిగ్రామ్ 9.4 వెర్షన్ అప్‍డేట్ (Telegram update) ద్వారా యూజర్లకు ఈ కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి. టెలిగ్రామ్‍కు కొత్తగా వస్తున్న ఈ 7 ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.

(1 / 7)
Granular media permissions: గ్రూప్‍లోని సభ్యులు ఎలాంటి మీడియా టైప్స్ పోస్ట్ చేయవచ్చో ఈ ఫీచర్ ద్వారా అడ్మిన్ కంట్రోల్ చేయగలరు. ఫొటోలు, వీడియోలు, వాయిస్ లాంటి 9 మీడియా టైప్స్ ఇందులో ఉంటాయి. ఉదాహరణకు ఈ ఫీచర్‌లో వీడియో పర్మిషన్‍ను అడ్మిన్ డిసేబుల్ చేస్తే ఆ గ్రూప్‍లో మెంబర్లు వీడియోలు పోస్ట్ చేయలేరు.
(2 / 7)
Profile picture maker: ఏ స్టిక్కర్, యానిమేటెడ్ ఎమోజీనైనా అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకునే సదుపాయం ఈ ప్రొఫైల్ పిక్చర్ మేకర్ ద్వారా రానుంది. టెలిగ్రామ్ యూజర్లందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది.
(3 / 7)
Auto-save incoming media: రిసీవ్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలో ఆటోమేటిక్‍గా సేవ్ అయ్యేలా ఈ ఆటో-సేవ్ ఇన్‍కమింగ్ మీడియా ఫీచర్ ఉపయోగపడుతుంది. ఏ సైజ్ వరకు ఉండే ఫైల్స్, ఏ టైప్ ఫైల్స్ సేవ్ అవ్వాలో కూడా సెట్ చేసుకోవచ్చు.
(4 / 7)
New Emoji categories: ఎమోజీలను విభిన్నమైన కేటగిరీలుగా విభజించుకునేలా కొత్త ఎమోజీ కేటగిరీస్ సదుపాయం అందుబాటులోకి వస్తోంది.
(5 / 7)
Network usage: టెలిగ్రామ్‍లో ఎంత డేటా వినియోగించామన్న వివరాలను పీ చార్ట్స్ ద్వారా యూజర్లు ఇక నెట్‍వర్క్ యూసేజ్ ఆప్షన్‍లో చూడవచ్చు.
(6 / 7)
Real-time translation: చాట్‍లోనే మెసేజ్‍లను ట్రాన్స్‌లేట్ చేసుకునే సదుపాయం ఈ రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ ద్వారా కలగనుంది. చాట్‍లో టాప్‍లో ట్రాన్స్‌లేట్ బార్ కనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు