TDP Formation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం... ఎన్టీఆర్ ఘాట్ కు నేతలు-tdp formation day celebrations at hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tdp Formation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం... ఎన్టీఆర్ ఘాట్ కు నేతలు

TDP Formation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం... ఎన్టీఆర్ ఘాట్ కు నేతలు

Mar 29, 2023, 07:32 PM IST HT Telugu Desk
Mar 29, 2023, 07:32 PM , IST

TDP Formation Day News: తెలుగుదేశం పార్టీ మరో వసంతంలోకి అడుగుపెట్టింది. పార్టీ ఆవిర్భవించి ఇవాళ్టితో 41 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్ నాంపల్లి వేదికగా భారీ సభను తలపెట్టింది. 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

(1 / 5)

ఆత్మగౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో తెలుదేశం వెలుగులు నింపిందన్నారు చంద్రబాబు . పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుజాతికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

(2 / 5)

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ పతాకంగా, రాజకీయ చైతన్యానికి సంకేతంగా  టీడీపీ ఆవిర్భవించి 41 ఏళ్లు పూర్తయిందన్నారు లోకేశ్. ఎన్టీఆర్‌ ఆశయాల మేరకు అణగారిన వర్గాలకు పసుపు జెండా అండగా నిలిచిందని ట్వీట్ చేశారు.

(3 / 5)

41 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో  హైద‌రాబాద్ లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభను తలపెట్టింది టీడీపీ. ఇందుకు చంద్రబాబు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

(4 / 5)

మరోవైపు ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారికి రాజమహేంద్రవరంలో నిర్వహించనుంది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు