తెలుగు న్యూస్ / ఫోటో /
AP Heavy Rains : ఫెంగల్ తుపాను ఎఫెక్ట్.. తల్లడిల్లిన తిరుపతి.. రికార్డు స్థాయిలో వర్షపాతం
- AP Heavy Rains : ఫెంగల్ తుపాను ఏపీని వణికిస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లా తల్లడిల్లిపోయింది. అతిభారీ వర్షాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కేఎం అగ్రహారంలో 187 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

(1 / 5)
ఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 వరకు) ఐదు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా కేఎం అగ్రహారంలో 187 మి.మీ, తిరుపతి కేకేఆర్కే పురంలో 162 మి.మీ, తిరుపతి జిల్లా రాచపాలెంలో 152 మి.మీ, తిరుపతి జిల్లా మన్నార్ పొలూరులో 149 మి.మి, తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో 137 మి.మీ వర్షపాతం నమోదైంది.(@APSDMA)
(2 / 5)
శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాన్ తీరంందాటింది. పశ్చిమ- నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. (@APSDMA)
(3 / 5)
ఫెంగల్ తపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైం గవర్నెన్స్ అధికారులకు పలు సూచనలు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
(4 / 5)
ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
ఇతర గ్యాలరీలు