OTT Thriller: ఓటీటీలో తెలుగు ఫాంటసీ థ్లిల్లర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు.. ఎక్కడంటే?-ka ott streaming viewership reached to 100 million minutes kiran abbavaram fantasy thriller ka ott release on etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller: ఓటీటీలో తెలుగు ఫాంటసీ థ్లిల్లర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు.. ఎక్కడంటే?

OTT Thriller: ఓటీటీలో తెలుగు ఫాంటసీ థ్లిల్లర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 01, 2024 11:45 AM IST

KA OTT Streaming Viewership: ఓటీటీలో తెలుగు పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ క అదరగొడుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన క మూవీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతోపాటు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ వ్యూయర్‌షిప్ సాధించింది. మరి క మూవీని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో తెలుగు ఫాంటసీ థ్లిల్లర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు.. ఎక్కడంటే?
ఓటీటీలో తెలుగు ఫాంటసీ థ్లిల్లర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు.. ఎక్కడంటే?

KA OTT Release And Streaming Minutes: ఓటీటీలో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అది కూడా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీస్‌పై మరింత క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీగా రూపొందిందే క మూవీ.

భారీ నిర్మాణ విలువలతో

థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన మూవీ క. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌‌తో నిర్మించారు.

దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూషన్

క మూవీకి ఇద్దరు డైరెక్టర్స్ సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా తమ దర్శకత్వ ప్రతిభ ఏంటో క సినిమాతో నిరూపించుకున్నారు. అయితే, క సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా.. మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్‌పై డిస్ట్రిబ్యూట్ చేశారు.

క మూవీ కలెక్షన్స్

దీపా‌వళి సందర్భంగా విడుదలైన క మూవీ బాక్సాఫీస్ రేసులో విన్నర్‌గా నిలిచింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మంచి హిట్ అందుకున్న క మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 28న ఈటీవీ విన్‌ క ఓటీటీ రిలీజ్ అయింది.

క ఓటీటీ స్ట్రీమింగ్ మినట్స్

అయితే, ఈటీవీ విన్‌లో డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన క డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. అతి తక్కువ టైమ్‌లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. అంటే, ఇప్పటికీ క ఓటీటీలో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల (10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలు) వ్యూయర్‌షిప్ తెచ్చుకుంది.

ఈటీవీ విన్‌లో రెస్పాన్స్

ఓటీటీలో క మూవీకి వచ్చిన రెస్పాన్స్ సందర్భంగా క బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. "మా క సినిమాకు థియేటర్స్‌లో వండర్‌ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ ఇప్పుడు ఈటీవీ విన్‌లో రావడం సంతోషంగా ఉంది" అని అన్నారు.

సౌండ్‌ను క్లియర్‌గా వింటూ

"డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో క ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. డాల్బీలో చూస్తే సీన్స్‌లోని ప్రతి డీటెయిలింగ్ బాగా తెలుస్తుంది. అలాగే అట్మాస్‌లో సౌండ్‌ను క్లియర్‌గా వింటూ దాని థీమ్‌ను అర్థం చేసుకుంటారు. ఈ సినిమా విషయంలో మాకు కిరణ్ గారు, ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేం. ఆడియెన్స్‌కు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాం" అని డైరెక్టర్ సుజీత్ తెలిపారు.

టీజర్ రిలీజ్ నుంచి

అలాగే, దర్శకుడు సందీప్ మాట్లాడుతూ.. "క సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా ఇంతబాగా రావడానికి కారణం కిరణ్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ గారు. గ్రాండ్ రిలీజ్ చేసి సినిమాను అందరికీ రీచ్ చేశారు వంశీ నందిపాటి గారు. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ క సినిమా సక్సెస్‌కు కారణం" అన్నారు.

Whats_app_banner