TTD Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప - ఫొటోలు-sri malayappa dressed as badari narayana blessed devotees on suryaprabha vahanam in ttd brahmotsavlu 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ttd Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప - ఫొటోలు

TTD Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప - ఫొటోలు

Oct 10, 2024, 12:11 PM IST Maheshwaram Mahendra Chary
Oct 10, 2024, 12:11 PM , IST

  • శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొసాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫొటోలు చూడండి….

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

(1 / 6)

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

(2 / 6)

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.

(3 / 6)

 ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. 

(4 / 6)

సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

(5 / 6)

ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు