తెలుగు న్యూస్ / ఫోటో /
OTT Thriller Movie: ఓటీటీలో జోరు చూపిస్తున్న థ్రిల్లర్ చిత్రం.. 100 మిలియన్ మినిట్స్ మార్క్ దాటి..
- OTT Thriller Movie: బెర్లిన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍లో దూకుడు కొనసాగిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో మైలురాయి అధిగమించింది.
- OTT Thriller Movie: బెర్లిన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍లో దూకుడు కొనసాగిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో మైలురాయి అధిగమించింది.
(1 / 5)
ఓటీటీలోకి నేరుగా వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమా ‘బెర్లిన్’ జోరు కంటిన్యూ చేస్తోంది. అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టు అదరగొడుతోంది.
(2 / 5)
బెర్లిన్ సినిమా జీ5 ఓటీటీలో తాజాగా 100 మిలియన్ వాచ్ మినిట్స్ మైల్‍స్టోన్‍ను అధిగమించింది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా వెల్లడించింది. తమ ప్లాట్‍ఫామ్‍లో సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నంబర్ వన్‍లో ట్రెండ్ అవుతోందని పేర్కొంది.
(3 / 5)
స్పై థ్రిల్లర్ మూవీ బెర్లిన్ సెప్టెంబర్ 13వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హిందీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. పలు ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమైన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
(4 / 5)
బెర్లిన్ చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మంచి వ్యూస్ సాధిస్తోంది. ఈ చిత్రంలో అపర్‌శక్తి, ఇష్వాక్, రాహుల్‍తో పాటు అనుప్రియా గోయెంకా, కబీర్ బేడీ, నితేశ్ పాండే కీలకపాత్రలు చేశారు.
(5 / 5)
బెర్లిన్ చిత్రానికి అతుల్ సబల్వాల్ దర్శకత్వం వహించారు. మాటలు, వినికిడి సరిగా లేని అశోక్ (ఇష్వాక్)ను విదేశీ గూఢచారిగా అనుమానించి ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేస్తుంది. సైన్ లాంగ్వేజ్ నిపుణుడు పుష్కిన్ వర్మ (అపర్‌శక్తి ఖురానా) అతడిని విచారిస్తాడు. ఈ క్రమంలో చాలా రహస్యాలు బయటపడతాయి. ట్విస్టులు ఉంటాయి.
ఇతర గ్యాలరీలు