Tollywood Updates on Diwali: దీపావళి రోజున టాలీవుడ్ సినిమాల ముఖ్యమైన అప్‍డేట్స్ ఇవే.. సలార్ నుంచి హనుమాన్ వరకు..-salaar trailer release date to hanuman first song announcement key tollywood movies updates on diwali ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tollywood Updates On Diwali: దీపావళి రోజున టాలీవుడ్ సినిమాల ముఖ్యమైన అప్‍డేట్స్ ఇవే.. సలార్ నుంచి హనుమాన్ వరకు..

Tollywood Updates on Diwali: దీపావళి రోజున టాలీవుడ్ సినిమాల ముఖ్యమైన అప్‍డేట్స్ ఇవే.. సలార్ నుంచి హనుమాన్ వరకు..

Published Nov 12, 2023 11:24 PM IST Chatakonda Krishna Prakash
Published Nov 12, 2023 11:24 PM IST

Tollywood Diwali Updates: దీపావళి సందర్భంగా కొన్ని తెలుగు సినిమాల అప్‍డేట్స్ వచ్చాయి. కొన్ని మూవీ యూనిట్లు నేడు (నవంబర్ 12) ప్రకటన చేశాయి. సలార్ ట్రైలర్ డేట్, హనుమాన్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ సహా మరిన్ని అనౌన్స్‌మెంట్లు వచ్చాయి. 

కొన్ని టాలీవుడ్‍ సినిమాల గురించి నేడు దీపావళి సందర్భంగా కీలకమైన అప్‍డేట్స్ వచ్చాయి. సలార్, హనుమాన్, సైంధవ్ సహా మరిన్ని మూవీ యూనిట్లు కీలక ప్రకటన చేశాయి. 

(1 / 6)

పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‍ను దీపావళి సందర్భంగా నేడు ప్రకటించింది హొంబాలే ఫిల్మ్స్. సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

(2 / 6)

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా నుంచి ‘రాంగ్ యూసేజ్’ అనే తొలి పాట నవంబర్ 21న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నేడు ప్రకటించింది మూవీ యూనిట్. ఈ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 

(3 / 6)

యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‍లో వస్తున్న సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ గురించి కూడా నేడు అప్‍డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి సూపర్ హీరో హనుమాన్ అనే ఫస్ట్ సాంగ్ నవంబర్ 14వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. 

(4 / 6)

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేకమైన పోస్టర్ వచ్చింది. దీంతో ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.   

(5 / 6)

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్నఈగల్ సినిమా నుంచి కూడా కొత్త పోస్టర్ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మూవీ యూనిట్ మరోసారి స్పష్టం చేసింది. సంక్రాంతి బరిలోనే ఈ చిత్రం ఉంటుందని చెప్పేసింది. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా నేడు మరికొన్ని సినిమాలకు చెందిన పోస్టర్లు కూడా వచ్చాయి. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు