తెలుగు న్యూస్ / ఫోటో /
TG New Ration Cards : తెలంగాణలో మారనున్న రేషన్ కార్డుల రూపం..? కొత్త కార్డులు కూడా జారీ..! ఇవిగో తాజా అప్డేట్స్
- New Ration Cards in Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల సంఖ్యలో ప్రజలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులను కూడా సర్కార్ స్వీకరించింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే…. రేషన్ కార్డుల మంజూరుపై కీలక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
- New Ration Cards in Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల సంఖ్యలో ప్రజలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులను కూడా సర్కార్ స్వీకరించింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే…. రేషన్ కార్డుల మంజూరుపై కీలక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
(1 / 6)
కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఇందుకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది.
(2 / 6)
కొత్త కార్డుల మంజూరు కంటే ముందు అనర్హులను తొలగించాలని ప్రభుత్వం భావించింది. ఈకేవైసీ ప్రక్రియ ద్వారా చాలా వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పటికే చాలా మంది అప్డేట్ కూడా చూసుకున్నారు. దీని ఆధారంగా రాష్ట్రంలో ఉన్న కార్డుల సంఖ్యపై సర్కార్ కు ఇప్పటికే అంచనాలు అందాయి.(TG CMO Twitter)
(3 / 6)
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. ఫలితంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. జూన్ 3వ తేదీతో కోడ్ పూర్తి కానుంది. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుపై విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.(photo source https://epds.telangana.gov.in)
(4 / 6)
ప్రజాపాలనలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా కొత్త కార్డుల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా… ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే ఆలోచనలో ఉంది. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.(photo source https://epds.telangana.gov.in)
(5 / 6)
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీటిలో కొందరి దగ్గర పాత రేషన్ కార్డులు ఉండగా,, మరికొందరి దగ్గర ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. అయితే వీటి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత వాటి స్థానంలో కొత్త రూపంలో రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు కసరత్తు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.(photo source https://epds.telangana.gov.in)
(6 / 6)
కొత్తరూపంలో రేషన్ కార్డులను జారీ చేయటమే కాకుండా కొత్త వాటిని కూడా మంజూరు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా త్వరలోనే విడుదల చేయాలని చూస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులను ఇచ్చి…. అనర్హులైన వారిని పూర్తిగా పక్కన పెట్టాలని భావిస్తోంది. ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత…. ప్రభుత్వం నుంచి త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.(photo source https://epds.telangana.gov.in)
ఇతర గ్యాలరీలు