తెలుగు న్యూస్ / ఫోటో /
Horror Comedy Movies: ఓటీటీలో మిస్సవ్వకుండా చూడాల్సిన హారర్ హారర్ కామెడీ మూవీస్ ఇవే!
హిట్టు శాతం ఎక్కువగా ఉన్న జోనర్‌లో హారర్ కామెడీ ఒకటి. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే భయపెడితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే సత్తా ఈ కథలకు ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్‌గా నిలిచిన కొన్ని బెస్ట్ హారర్ కామెడీ మూవీస్ ఏ ఓటీటీలో చూడాలంటే?
(1 / 6)
తాప్సీ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ఆనందోబ్రహ్మ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గా హిట్టు టాక్‌ను తెచ్చుకున్నది. ఇందులో శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్, షకలకశంకర్ కీలక పాత్రలు పోషించారు.
(2 / 6)
హన్సిక, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన అరాణ్మణై నవ్విస్తూనే ప్రేక్షకుల్ని భయపెట్టింది. థియేటర్లలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియాలో రిలీజైంది.
(3 / 6)
సంతానం హీరోగా నటించిన హారర్ కామెడీ మూవీ దిల్లుకు దుడ్డు సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. కోటి బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 15 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
(4 / 6)
లారెన్స్ హీరోగా తమిళంలో వచ్చిన కాంచన సిరీస్ సినిమాలన్నీ బిగ్గెస్ట్ సక్సెస్‌లుగా నిలిచాయి. వీటిలో కాంచన మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కాంచన 3 మాత్రం జీ5లో చూడొచ్చు.
(5 / 6)
తెలుగులో వచ్చిన బెస్ట్ హారర్ కామెడీ సినిమాల్లో గీతాంజలి ఒకటిగా నిలిచింది. అంజలి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని జీ5 ఓటీటీలో చూడొచ్చు.
ఇతర గ్యాలరీలు