(1 / 5)
పారిస్ ఒలింపిక్స్ 2024 ఆర్చరీలో భారత్‍కు పతకం వస్తుందని పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. మహిళల సింగిల్స్ ఆర్చరీ ఈవెంట్‍లో భారత ప్లేయర్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్ చేరినా పతకం దక్కలేదు. క్వార్టర్ ఫైనల్‍లో నేడు (ఆగస్టు 3) దీపికా ఓటమి పాలయ్యారు.
(AP)(2 / 5)
దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహియెన్ చేతిలో క్వార్టర్ ఫైనల్‍లో 4-6 తేడాతో భారత ఆర్చర్ దీపికా కుమారి పరాజయం చెందారు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీలో భారత్‍కు పతకం దక్కలేదు.
(AP)(3 / 5)
ఈ క్వార్టర్ ఫైనల్‍లో 28-26తో ఫస్ట్ సెట్‍లో దీపికా శుభారంభం చేశారు. 9,10,9 స్కోరుతో రాణించారు.
(AP)(4 / 5)
సెకండ్ సెట్‍ను 25-28తో దీపికా కోల్పోయారు. మూడో సెట్‍లో మళ్లీ 29-28తో ముందడుగు వేశారు.
(Doordarshan Sports X)(5 / 5)
నాలుగో సెట్‍లో రెండో ప్రయత్నంలో 7 పాయింట్లు రావడంతో దీపికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సెట్ నామ్ సుహియెన్ 27-29 కైవసం అయింది. ఐదో సెట్ కూడా ఆమెనే పైచేయి సాధించారు. దీంతో దీపికా కుమారి ఓటమి పాలయ్యారు.
(AP)ఇతర గ్యాలరీలు