OnePlus 13: త్వరలో లాంచ్ కానున్న వన్‍ప్లస్ 13: స్పెసిఫికేషన్లు ఎలా ఉండొచ్చంటే..-oneplus 13 to launch soon know the specifications features and more details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Oneplus 13: త్వరలో లాంచ్ కానున్న వన్‍ప్లస్ 13: స్పెసిఫికేషన్లు ఎలా ఉండొచ్చంటే..

OnePlus 13: త్వరలో లాంచ్ కానున్న వన్‍ప్లస్ 13: స్పెసిఫికేషన్లు ఎలా ఉండొచ్చంటే..

Sep 14, 2024, 04:41 PM IST Chatakonda Krishna Prakash
Sep 14, 2024, 04:38 PM , IST

OnePlus 13: వన్‍ప్లస్ 13 మొబైల్ త్వరలో విడుదల కానుంది. ఈ ఫ్లాగ్‍షిప్ ఫోన్‍కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇప్పటికే లీకుల ద్వారా బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి. 

వన్‍ప్లస్ 13 లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అక్టోబర్‌లో ఈ ఫ్లాగ్‍షిప్ మొబైల్ చైనాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని వన్‍ప్లస్ చైనా చీఫ్ వెల్లడించారు. అయితే, ఈ ఫోన్ ఇండియాలో 2025 జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

(1 / 5)

వన్‍ప్లస్ 13 లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అక్టోబర్‌లో ఈ ఫ్లాగ్‍షిప్ మొబైల్ చైనాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని వన్‍ప్లస్ చైనా చీఫ్ వెల్లడించారు. అయితే, ఈ ఫోన్ ఇండియాలో 2025 జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. (OnePlus)

వన్‍ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 2కే రెజల్యూషన్ ఉండే బీఓఈ ఎక్స్2 డిస్‍ప్లేతో రానుంది. డిస్‍ప్లే సైజ్ 6.8 ఇంచులుగా ఉండొచ్చు. ఎల్‍టీపీవో మైక్రో కర్వ్డ్ డిస్‍ప్లే ఉంటుంది. 

(2 / 5)

వన్‍ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 2కే రెజల్యూషన్ ఉండే బీఓఈ ఎక్స్2 డిస్‍ప్లేతో రానుంది. డిస్‍ప్లే సైజ్ 6.8 ఇంచులుగా ఉండొచ్చు. ఎల్‍టీపీవో మైక్రో కర్వ్డ్ డిస్‍ప్లే ఉంటుంది. (OnePlus)

లేటెస్ట్ ఫ్లాగ్‍షిప్ ప్రాసెసర్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్, మరింత మెరుగైన అడ్రెనో జీపీయూను వన్‍ప్లస్ 13 కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుందనే లీకులు వచ్చాయి. 

(3 / 5)

లేటెస్ట్ ఫ్లాగ్‍షిప్ ప్రాసెసర్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్, మరింత మెరుగైన అడ్రెనో జీపీయూను వన్‍ప్లస్ 13 కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుందనే లీకులు వచ్చాయి. (Amazon)

వన్‍ప్లస్ 13 వెనుక మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‍వైటీ808 మెయిన్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. వన్‍ప్లస్ 12లాగే కెమెరా మాడ్యూల్ రౌండ్ షేప్‍లోనే ఉండొచ్చు. 

(4 / 5)

వన్‍ప్లస్ 13 వెనుక మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‍వైటీ808 మెయిన్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. వన్‍ప్లస్ 12లాగే కెమెరా మాడ్యూల్ రౌండ్ షేప్‍లోనే ఉండొచ్చు. (OnePlus)

వాటర్, డస్ట్ రెసిస్టెంట్‍గా ఉండేందుకు ఐపీ69 రేటింగ్‍తో వస్తుందని తెలుస్తోంది. ఇది పెద్ద అప్‍గ్రేడ్‍గా ఉండనుంది. అలాగే, వన్‍ప్లస్ 12తో పోలిస్తే డిస్‍ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరా సహా వివిధ విభాగాల్లో అప్‍గ్రేడ్లతో వన్‍ప్లస్ 13 రానుంది. 

(5 / 5)

వాటర్, డస్ట్ రెసిస్టెంట్‍గా ఉండేందుకు ఐపీ69 రేటింగ్‍తో వస్తుందని తెలుస్తోంది. ఇది పెద్ద అప్‍గ్రేడ్‍గా ఉండనుంది. అలాగే, వన్‍ప్లస్ 12తో పోలిస్తే డిస్‍ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరా సహా వివిధ విభాగాల్లో అప్‍గ్రేడ్లతో వన్‍ప్లస్ 13 రానుంది. (OnePlus)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు