తెలుగు న్యూస్ / ఫోటో /
MS Dhoni Birthday: ధోనీ ఎందుకంత స్పెషల్.. ఈ మూమెంట్స్ చాలు అతని గురించి చెప్పడానికి..
- MS Dhoni Birthday: ధోనీ ఎందుకంత స్పెషల్? అతని కెరీర్లోని ఈ మూమెంట్స్ చాలు అతని గురించి చెప్పడానికి. శుక్రవారం (జులై 7) తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ధోనీ జీవితంలో మరుపురాని క్షణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఫొటోల రూపంలో మనం చూద్దాం.
- MS Dhoni Birthday: ధోనీ ఎందుకంత స్పెషల్? అతని కెరీర్లోని ఈ మూమెంట్స్ చాలు అతని గురించి చెప్పడానికి. శుక్రవారం (జులై 7) తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ధోనీ జీవితంలో మరుపురాని క్షణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఫొటోల రూపంలో మనం చూద్దాం.
(1 / 9)
MS Dhoni Birthday: ఇండియాలో ఓ మధ్య తరగతి యువకుడు క్రికెటర్ కావాలని, ఇండియన్ టీమ్ లో ఆడాలని కలలు కనేలా చేసిన ఘనత ధోనీదే. రాంచీలాంటి ఓ చిన్న నగరం నుంచి వచ్చిన ధోనీ.. ఆ నగరానికే కేరాఫ్ అయ్యాడంటే అతిశయోక్తి కాదు.(Hindustan Times)
(2 / 9)
MS Dhoni Birthday: ట్రోఫీలు అందుకోవడం ధోనీకి కొత్త కాదు. మూడు ఐసీసీ ట్రోఫీలూ గెలిచిన ఘనత అతని సొంతం. ఇది స్కూల్ వయసులో ధోనీ సాధించిన తొలి ట్రోఫీ కావడం విశేషం.
(3 / 9)
MS Dhoni Birthday: 2004లో టార్జాన్ లాంటి జుట్టుతో టీమిండియాలోకి అడుగుపెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ. అప్పట్లో మంచి వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న ఇండియన్ టీమ్ కు ఆ లోటు భర్తీ అయిందన్న ఆలోచనే ఉంది. కానీ భవిష్యత్తులో అతడే ఈ స్థాయికి ఎదుగుతాడని ఎవరూ కలలో కూడా ఊహించలేదు.
(4 / 9)
MS Dhoni Birthday: జీవితంలో అన్నీ ట్రై చేయాలనుకుంటాడు ధోనీ. అలా వికెట్ కీపరే అయినా గ్లోవ్స్ పక్కన పెట్టి బౌలింగ్ చేయడం అతనికి అలవాటు. తన కెరీర్లో కొన్నిసార్లు అలా చేశాడు.
(5 / 9)
MS Dhoni Birthday: ఈ మూమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భం. దాయాది పాకిస్థాన్ ను ఫైనల్లో చిత్తు చేయడం మరింత ప్రత్యేకం. ఇండియన్ క్రికెట్లో మహేంద్ర జాలం మొదలైన అపూర్వ ఘట్టం.
(6 / 9)
MS Dhoni Birthday: ఆరు వరల్డ్ కప్‌ల నుంచీ ఆడుతున్న సచిన్ కలను, 28 ఏళ్ల భారతీయుల నిరీక్షణకు తెరదించిన సమయం ఇది. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన సందర్భం. ధోనీని మరో లెవల్ కు తీసుకెళ్లిన క్షణం.
(7 / 9)
MS Dhoni Birthday: ఇండియా చివరిసారి ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచిన క్షణమిది. 2013లో ధోనీ కెప్టెన్సీలోనే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడు ఐసీసీ ట్రోఫీలూ గెలిచిన తొలి కెప్టెన్ గా ధోనీని నిలిపిన సందర్భమిది.
(8 / 9)
MS Dhoni Birthday: ఇటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపి.. ఇక్కడ కూడా తాను తిరుగులేని కెప్టెన్ అని నిరూపించుకున్నాడు మిస్టర్ కూల్ ధోనీ.(Hindustan Times)
ఇతర గ్యాలరీలు