TG Rythu Runamafi Updates : మీకు ఇంకా రుణమాఫీ కాలేదా..? ఆ టైమ్ వరకు ఆగాల్సిందే..! ఇవిగో తాజా అప్డేట్స్
- తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మంగా రుణమాఫీ స్కీమ్ ను పట్టాలెక్కించింది. 2018 నుంచి ఉన్న రూ. 31 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయించగా… ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేసింది. మిగతా రైతులు మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. వీరి రుణాలను కూడా మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
- తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మంగా రుణమాఫీ స్కీమ్ ను పట్టాలెక్కించింది. 2018 నుంచి ఉన్న రూ. 31 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయించగా… ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేసింది. మిగతా రైతులు మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. వీరి రుణాలను కూడా మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
(1 / 6)
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ స్కీమ్ చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 31వేల కోట్లను మాఫీ చేయాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు రూ. 18వేల కోట్లకు పైగా మాఫీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. త్వరలోనే మిగతా రైతులకు కూడా మాఫీ వర్తించే విధంగా సర్కార్ కసరత్తు చేస్తోంది.
(2 / 6)
ఇదే అంశంపై తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామని పేర్కొన్నారు.
(3 / 6)
తెల్ల రేషన్ కార్డు లేని మూడు లక్షల మందికి కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు అదనపు డబ్బులు కడితే మాఫీ చేస్తామని వివరించింది. దీనికి త్వరలోనే షెడ్యూలు ఖరారు చేస్తామని చెప్పారు. డిసెంబర్ లోపు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.
(4 / 6)
రేషన్ కార్డు లేని దాదాపు 3 లక్షల కుటుంబాల వివరాలను అధికారులు ఇంటింటి సర్వేతో గుర్తించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.. వీరందరికీ డిసెంబర్ లోపు రూ. 2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
(5 / 6)
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్… ఇచ్చిన ప్రకారం 42 లక్షల కుటుంబాలను రుణ విముక్తులను చేసే బాధ్యత తీసుకుంటుందని తుమ్మల ఓ ప్రశ్నకు చెప్పుకొచ్చారు. అర్హులైన రైతులకు తప్పకుండా స్కీమ్ వర్తింపజేస్తామని తెలిపారు.
(6 / 6)
ఇక రైతు భరోసాపై కూడా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే… రైతు భరోసా అమలు చేస్తామన్నారు. ఈ సీజన్ లో కాకుండా… వచ్చే రబీ సీజన్ లో అమలు చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే… రూ. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు డిసెంబర్ లోపు మాఫీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు