తెలుగు న్యూస్ / ఫోటో /
TG Govt DA : ఉద్యోగులకు 2 డీఎలు.. కొత్త హెల్త్ కార్డులు.. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన!
- TG Govt DA : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు.. సర్కారు తీపి కబురు చెప్పింది. పెండింగ్‌లో ఉన్న డీఏలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. అతి త్వరలోనే వీటిపై నిర్ణయంపై తీసుకుంటామని తెలంగాణ మంత్రి చెప్పారు.
- TG Govt DA : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు.. సర్కారు తీపి కబురు చెప్పింది. పెండింగ్‌లో ఉన్న డీఏలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. అతి త్వరలోనే వీటిపై నిర్ణయంపై తీసుకుంటామని తెలంగాణ మంత్రి చెప్పారు.
(1 / 5)
ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి మొత్తం 4 డీఏలు పెండింగ్ ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహా వివరించారు. అందులో కనీసం 3 డీఏలు లు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు. (@DamodarCilarapu)
(2 / 5)
త్వరలో ఉద్యోగులకు డీఏలను అందజేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రకటించారు. అలాగే తెలంగాణలోని ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.(@DamodarCilarapu)
(3 / 5)
డీఏ చెల్లింపుల వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ చెల్లించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో మూడు.. కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఒక డీఏ పెండింగ్ లో ఉంది. నాలుగు డీఏల్లో రెండింటిని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
(4 / 5)
రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తికాగానే.. ఉద్యోగుల రెండు డీఏలను క్లియర్ చేసేందుకు నిధుల సమీకరించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. దసరా పండుగ నాటికి డీఏలను ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో సెప్టెంబర్ నెలఖారు వరకు నిధులు సమీకరించాలని సీఎం ఆర్థిక శాఖను ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు.
(5 / 5)
పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. 53 ఉద్యోగుల సంఘాలతో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఇప్పటికే జేఏసీని ఏర్పాటు చేశారు. డీఏలపై ఏ నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి పోరాటం సిద్ధమని ఉద్యోగులు ప్రకటించారు.(@DamodarCilarapu)
ఇతర గ్యాలరీలు