Men Fashion Tips | మగాళ్లు స్టైల్‌గా ఉండాలంటే.. ఈ ఫ్యాషన్ చిట్కాలు ఫాలో అవ్వాలి!-men fashion tips these fashion pieces must have in a man s capsule wardrobe ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Men Fashion Tips | మగాళ్లు స్టైల్‌గా ఉండాలంటే.. ఈ ఫ్యాషన్ చిట్కాలు ఫాలో అవ్వాలి!

Men Fashion Tips | మగాళ్లు స్టైల్‌గా ఉండాలంటే.. ఈ ఫ్యాషన్ చిట్కాలు ఫాలో అవ్వాలి!

Jun 01, 2022, 08:19 PM IST HT Telugu Desk
Jun 01, 2022, 05:22 PM , IST

ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసిన అమ్మాయిల ఫ్యాషన్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. మరి మగాళ్లకు ఫ్యాషన్ తెలియదా? లేక వారికి ఫ్యాషన్‌కు సంబంధించిన ఎలాంటి దుస్తులు ఉండవా? ఫ్యాషన్‌కు ఆడ, మగ అనే తేడా ఏమి ఉండదు. అందుకే ఈసారి అబ్బాయిల కోసం ఇక్కడ కొన్ని ఫ్యాషన్ చిట్కాలను అందిస్తున్నాం.

 

డియర్ బాయ్స్... మీరు ఎప్పుడైనా ఏం ధరించాలి, ఎలాంటి కాంబినేషన్ వేసుకోవాలి, మ్యాచింగ్ అవుతుందా, లేదా? అనేది ఆలోచించారా? మహిళల ఫ్యాషన్‌లో క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌లు మంచి జనాదరణ పొందినప్పటికీ, అబ్బాయిల కోసం కూడా క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌లు ఉంటాయనేది మనం కొన్నిసార్లు మరచిపోతాము. ఇక్కడ క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌ అంటే అన్ని రకాల మ్యాచింగ్ దుస్తుల కలయిక.

(1 / 8)

డియర్ బాయ్స్... మీరు ఎప్పుడైనా ఏం ధరించాలి, ఎలాంటి కాంబినేషన్ వేసుకోవాలి, మ్యాచింగ్ అవుతుందా, లేదా? అనేది ఆలోచించారా? మహిళల ఫ్యాషన్‌లో క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌లు మంచి జనాదరణ పొందినప్పటికీ, అబ్బాయిల కోసం కూడా క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌లు ఉంటాయనేది మనం కొన్నిసార్లు మరచిపోతాము. ఇక్కడ క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌ అంటే అన్ని రకాల మ్యాచింగ్ దుస్తుల కలయిక.(Photo by Artem Beliaikin on Unsplash)

మంచిది ప్రతిదీ క్యాప్సూల్‌లో వస్తుంది. అది ఔషధం కావొచ్చు, ఆహారం, టైమ్, దుస్తులు ఏదైనా. క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అనేది క్లాసిక్ వివిధ దుస్తులు, యాక్సెసరీస్ల సమాహారం. ఇది లుక్-ఆఫ్టర్ లుక్‌ని సృష్టించడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డామెన్స్చ్‌లోని ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక సాగర్ అబ్బాయిల కోసం క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌ను ఎలా రూపొందించాలో జరాఫ్‌షాన్ షిరాజ్‌తో కలిసి కొన్ని సూచనలను ఇచ్చారు.

(2 / 8)

మంచిది ప్రతిదీ క్యాప్సూల్‌లో వస్తుంది. అది ఔషధం కావొచ్చు, ఆహారం, టైమ్, దుస్తులు ఏదైనా. క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అనేది క్లాసిక్ వివిధ దుస్తులు, యాక్సెసరీస్ల సమాహారం. ఇది లుక్-ఆఫ్టర్ లుక్‌ని సృష్టించడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డామెన్స్చ్‌లోని ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక సాగర్ అబ్బాయిల కోసం క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌ను ఎలా రూపొందించాలో జరాఫ్‌షాన్ షిరాజ్‌తో కలిసి కొన్ని సూచనలను ఇచ్చారు.(Antonio Sokic)

డెనిమ్ జీన్స్ ఎంతో అనువైనవి, మన్నికైనవి, స్టైలిష్‌గా ఉంటాయి. వీటిని మగవారి వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉంచాలి. ఇందులో బ్లూకలర్ డెనిమ్ జీన్స్ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. కాబట్టి సాంప్రదాయిమైన స్ట్రెయిట్-ఫిట్ లేదా స్లిమ్-ఫిట్ జీన్స్‌ని ఉంచండి. వీటికి మ్యాచింగ్ గా స్పోర్ట్స్ జాకెట్, బటన్-డౌన్ షర్ట్ , బ్రౌన్ డ్రెస్ షూస్‌తో డ్రెస్ చేసుకోండి లేదా టీ-షర్ట్, స్నీకర్లతో ధరించండి

(3 / 8)

డెనిమ్ జీన్స్ ఎంతో అనువైనవి, మన్నికైనవి, స్టైలిష్‌గా ఉంటాయి. వీటిని మగవారి వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉంచాలి. ఇందులో బ్లూకలర్ డెనిమ్ జీన్స్ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. కాబట్టి సాంప్రదాయిమైన స్ట్రెయిట్-ఫిట్ లేదా స్లిమ్-ఫిట్ జీన్స్‌ని ఉంచండి. వీటికి మ్యాచింగ్ గా స్పోర్ట్స్ జాకెట్, బటన్-డౌన్ షర్ట్ , బ్రౌన్ డ్రెస్ షూస్‌తో డ్రెస్ చేసుకోండి లేదా టీ-షర్ట్, స్నీకర్లతో ధరించండి(SHVETS production)

మీ మినిమలిస్ట్ వార్డ్‌రోబ్‌ను సన్నద్ధం చేసేటప్పుడు టీ-షర్టులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రత్యేకించి మీరు మీ లుక్స్ రిలాక్స్‌గా, యవ్వనంగా ఉండాలని కోరుకుంటే. క్రూ నెక్ టీ-షర్టులు తటస్థ రంగులలో ఉండాలి. తెల్లటి టీ-షర్టు తప్పనిసరిగా ఉంచుకోవాలి. దానిని సూట్/జాకెట్‌తో, రిప్ప్డ్ జీన్స్‌తో ధరించాలి. ఇలాగా ఎంతో రిచ్ లుక్ ఉంటుంది. వైట్ టీషర్ట్ కాకుండా టీషర్టుల్లో నలుపు, గ్రేస్, బ్లూస్, బ్రౌన్స్, గ్రీన్ షేడ్స్ మగవారికి బాగుంటాయి.

(4 / 8)

మీ మినిమలిస్ట్ వార్డ్‌రోబ్‌ను సన్నద్ధం చేసేటప్పుడు టీ-షర్టులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రత్యేకించి మీరు మీ లుక్స్ రిలాక్స్‌గా, యవ్వనంగా ఉండాలని కోరుకుంటే. క్రూ నెక్ టీ-షర్టులు తటస్థ రంగులలో ఉండాలి. తెల్లటి టీ-షర్టు తప్పనిసరిగా ఉంచుకోవాలి. దానిని సూట్/జాకెట్‌తో, రిప్ప్డ్ జీన్స్‌తో ధరించాలి. ఇలాగా ఎంతో రిచ్ లుక్ ఉంటుంది. వైట్ టీషర్ట్ కాకుండా టీషర్టుల్లో నలుపు, గ్రేస్, బ్లూస్, బ్రౌన్స్, గ్రీన్ షేడ్స్ మగవారికి బాగుంటాయి.(cottonbro)

పురుషుల వార్డ్‌రోబ్ స్టేపుల్‌ల జాబితాలో షార్ట్‌లు కూడా ఉంచాలి. ఒక జత మంచి నాణ్యత కలిగిన, సౌకర్యవంతమైన క్లాసిక్ షార్ట్స్ ఉంచుకోవడం తప్పనిసరి. షర్ట్, టీ-షర్టు, పోలో, ట్యాంక్ టాప్ వేటి మీద వేసుకోవడానికైనా సరిపోతాయి. వేసవిలో అద్భుతమైన ఎంపిక కూడా.

(5 / 8)

పురుషుల వార్డ్‌రోబ్ స్టేపుల్‌ల జాబితాలో షార్ట్‌లు కూడా ఉంచాలి. ఒక జత మంచి నాణ్యత కలిగిన, సౌకర్యవంతమైన క్లాసిక్ షార్ట్స్ ఉంచుకోవడం తప్పనిసరి. షర్ట్, టీ-షర్టు, పోలో, ట్యాంక్ టాప్ వేటి మీద వేసుకోవడానికైనా సరిపోతాయి. వేసవిలో అద్భుతమైన ఎంపిక కూడా.(Budgeron Bach)

ట్రెండీ ఫ్యాషన్‌ల కంటే క్లాసిక్‌లను ఇష్టపడే పురుషులకు పోలో టీ-షర్ట్ బెస్ట్ ఛాయిస్. ఇవి చాలా రంగుల్లో లభ్యమవుతున్నప్పటికీ బేసిక్స్ లేదా బోల్డ్ రంగులను ఎంచుకోవడం ఉత్తమం. పోలో టీషర్ట్ వేసుకున్నప్పుడు చైన్ లేదా గడియారం, తెల్లటి బూట్లు, సన్ గ్లాసెస్ వంటి యాక్సెసరీస్ ధరించడం గొప్ప లుక్ వస్తుంది.

(6 / 8)

ట్రెండీ ఫ్యాషన్‌ల కంటే క్లాసిక్‌లను ఇష్టపడే పురుషులకు పోలో టీ-షర్ట్ బెస్ట్ ఛాయిస్. ఇవి చాలా రంగుల్లో లభ్యమవుతున్నప్పటికీ బేసిక్స్ లేదా బోల్డ్ రంగులను ఎంచుకోవడం ఉత్తమం. పోలో టీషర్ట్ వేసుకున్నప్పుడు చైన్ లేదా గడియారం, తెల్లటి బూట్లు, సన్ గ్లాసెస్ వంటి యాక్సెసరీస్ ధరించడం గొప్ప లుక్ వస్తుంది.(Andrea Piacquadio)

స్వెట్‌ప్యాంట్లు - ఆఫ్-డ్యూటీ స్టైల్‌లో వీటికివే సాటి. ఒక జత సౌకర్యవంతమైన స్వెట్‌ప్యాంట్‌లు ఉంచుకోవాలి. బాక్స్-ఫ్రెష్ స్నీకర్లతో వీటిని ధరించండి లేదా జాకెట్ , బీనీతో లేయర్ అప్ చేయండి. లేత గోధుమరంగులో ఉన్నవి ధరిస్తే క్లాస్ లుక్ వస్తుంది. మీరు వీటిని బ్లేజర్, టీ-షర్టులతో కూడా ధరించవచ్చు.

(7 / 8)

స్వెట్‌ప్యాంట్లు - ఆఫ్-డ్యూటీ స్టైల్‌లో వీటికివే సాటి. ఒక జత సౌకర్యవంతమైన స్వెట్‌ప్యాంట్‌లు ఉంచుకోవాలి. బాక్స్-ఫ్రెష్ స్నీకర్లతో వీటిని ధరించండి లేదా జాకెట్ , బీనీతో లేయర్ అప్ చేయండి. లేత గోధుమరంగులో ఉన్నవి ధరిస్తే క్లాస్ లుక్ వస్తుంది. మీరు వీటిని బ్లేజర్, టీ-షర్టులతో కూడా ధరించవచ్చు.(Mikhail Nilov)

సంబంధిత కథనం

సమ్మర్ ఫ్యాషన్Brokini- swimsuit for menMen's Hygiene Tips Skincare for menCouple శృంగారం 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు