తెలుగు న్యూస్ / ఫోటో /
Motivational Lines | ఇతరులతో మీకేంటి పోలిక.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి!
- మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారా లేదా కఠిన పరిస్థితులపై ఆందోళన చెందుతుంటారా? అయితే ఇది మీలోని శక్తిని హరిస్తుందని మానసిక వైద్యులు అంటున్నారు.
- మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారా లేదా కఠిన పరిస్థితులపై ఆందోళన చెందుతుంటారా? అయితే ఇది మీలోని శక్తిని హరిస్తుందని మానసిక వైద్యులు అంటున్నారు.
(1 / 10)
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే దానిపై ఎక్కువగా ఆలోచించడం, ఇతరులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేయడం, ప్రతి దానికి ఇతరులతో పోల్చుకోవడం ఇవన్నీ మిమ్మల్ని బలహీనుల్ని చేస్తాయని మానసిక వైద్యులు చెప్తున్నారు.(Pexels)
(2 / 10)
మీరు చేసే ప్రతీది పర్ఫెక్టుగా ఉండాలనుకోవడం మంచిదే దానికోసం దృఢంగా ప్రయత్నిస్తే మీకు సంతృప్తినిస్తుంది. ఇతరుల సంతృప్తి కోసం తీవ్రంగా శ్రమిస్తే అది మీకు అసంతృప్తినే మిగులుస్తుంది.(Pexels)
(3 / 10)
మన నియంత్రణలో లేని పరిస్థితులను నియంత్రించాలనుకోవడం కొన్ని సార్లు మూర్ఖత్వం అవుతుంది. అన్నీ మనం అనుకున్న విధంగా సాగవు అని గుర్తెరగాలి. బలవంతపు ప్రయత్నం వ్యర్థమే.(Pixabay)
(4 / 10)
ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ.. ఎవరు కరెక్ట్, ఎవరిది ఒప్పు.. ఇలా ఇంకొకరితో పోల్చుకోవడం సరైంది కాదు. అది మిమ్మల్ని నెగెటివ్ జోన్ లోకి నెట్టివేస్తుంది.(Pixabay)
(5 / 10)
మనకంటూ సొంత నిర్ణయాలు ఉండాలి. ప్రతి సమస్యలు ఇతరులపై ఆధారపడితే ఆత్మ గౌరవం తగ్గుతుంది. ఆందోళన, నిరాశ పెరుగుతుంది.(Pexels)
(6 / 10)
నీకంటూ ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. అది అలాగే ఉండనీ, కానీ ఇంకొకరిలాగా ప్రవర్తించవద్దు. ఆ నటన ఎక్కువ కాలం నిలవదు. అది మిమ్మల్ని ముంచేస్తుంది.(Unsplash)
(7 / 10)
మీకు ఆనందం కలిగించని పనులు చేయకండి. ఎవరో బలవంత పెడితే వారికోసం మీ ఆనందాలను చంపుకుంటే అది కాలక్రమేణా మీకు దు:ఖాన్ని కలిగిస్తుంది.(Unsplash)
(8 / 10)
మీరు ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటి కర్మలు మీరిప్పుడు అనుభవించవచ్చు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా గతంలోనే ఉండకండి, వదిలేయండి.. ఆ ఛేదు గతం మరిచిపోండి.(Pexels)
(9 / 10)
ఎవరైనా మన గురించి తప్పుగా అనుకుంటే అది వారి ఒపీనియన్ మాత్రమే, మన క్యారెక్టర్ కాదు. కాబట్టి లైట్ తీస్కో బాస్!(Pexels)
ఇతర గ్యాలరీలు