తెలుగు న్యూస్ / ఫోటో /
Bedrest in pregnancy: ప్రెగ్నెన్సీలో పూర్తిగాబెడ్ రెస్ట్ ఎలాంటి సందర్బాల్లో సిఫార్సు చేస్తారు?
Bedrest in pregnancy: గర్భధారణ సమయంలో వచ్చే సమస్యల కారణంగా, కొంతమంది మహిళల్లో గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని నివారించడానికి, వైద్యులు చాలాసార్లు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తారు. ఆ విషయంలో అందరికీ అవగాహన ఉండాలి.
(1 / 5)
గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శిశువు ఎదుగుదల కోసం ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర పోవాలని సలహా ఇస్తారు. కానీ కొన్నిసార్లు గర్భిణీ స్త్రీ పూర్తగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సాధారణంగా వైద్యులు ఎప్పుడు పూర్తి బెడ్‌రెస్ట్ సిఫార్సు చేస్తారో తెల్సుకోండి. (pexels)
(2 / 5)
ప్రీఎక్లాంప్సియా: గర్భధారణ సమయంలో ప్రీఎక్లాంప్సియా సమస్య ఉన్నప్పుడు, వాపుతో మహిళ రక్తపోటు పెరుగుతుంది, మూత్రంలో ప్రోటీన్ పరిమాణం పెరుగుతుంది. గర్భధారణ సమయంలో ప్రీఎక్లాంప్సియా సమస్య ఉంటే, డాక్టర్ స్త్రీకి విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వవచ్చు. ఇలా చేయడం వల్ల డెలివరీ సురక్షితంగా అయ్యే అవకాశాలు పెరుగుతాయి.(freepik)
(3 / 5)
మల్టిపుల్ ప్రెగ్నెన్సీ: కవలలకు జన్మనివ్వబోతున్న తల్లులకు బెడ్ రెస్ట్ కూడా వైద్యులు సిఫార్సు చేస్తారు. తద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటూ, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. బహుళ పిల్లల గర్భధారణ సమయంలో తల్లి ఎముకలలో తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వైద్యులు బెడ్ రెస్ట్ సిఫార్సు చేస్తారు.(pexel)
(4 / 5)
యోని రక్తస్రావం: అకాల మావి విభజన లేదా ముందస్తు ప్రసవం జరిగే అవకాశం ఉన్నప్పుడు చికిత్స తర్వాత వైద్యులు బెడ్ రెస్ట్ సిఫారసు చేస్తారు
ఇతర గ్యాలరీలు