తెలుగు న్యూస్ / ఫోటో /
Kitchen Hacks । నాన్ స్టిక్ పాత్రలలో వండుతున్నారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!
- Kitchen Hacks: నాన్ స్టిక్ పాత్రలు వంట చేసేటపుడు, కడిగేటపుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవిగో సమస్యలు.
- Kitchen Hacks: నాన్ స్టిక్ పాత్రలు వంట చేసేటపుడు, కడిగేటపుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవిగో సమస్యలు.
(1 / 7)
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట చేయడాన్ని చాలా మంది ఆనందిస్తారు. ఎంతో డబ్బు పోసి నాన్‌స్టిక్ పాత్రలను కొనుగోలు చేస్తారు.
(2 / 7)
స్టోర్ నుండి నాన్‌స్టిక్ పాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత, ముందుగా దానిని తడి స్పాంజ్‌తో తుడవండి. ఆపై కొద్దిగా నూనె అప్లై చేసి ఉంచితే, వాటిపై లేయర్ సురక్షితంగా ఉంచవచ్చు.
(3 / 7)
నాన్‌స్టిక్ పాత్రలను ఇతర సాధారణ ప్యాన్‌లు లేదా వోక్స్‌ల లాగా ఎక్కువ వేడి చేయకూడదు. ఎల్లప్పుడూ మీడియం నుండి తక్కువ మంట మీద ఉడికించాలి. నాన్‌స్టిక్ పాత్రలను ఖాళీగా కూడా వేడిచేయకూడదు.
(4 / 7)
నాన్‌స్టిక్ ప్యాన్‌లపై చెక్క లేదా సిలికాన్ స్పూన్లను ఉపయోగించండి. లోహపు స్పూన్లు పూతను దెబ్బతీస్తాయి.
(5 / 7)
నాన్‌స్టిక్ పాన్‌ను శుభ్రం చేయడానికి స్పాంజ్‌ని ఉపయోగించండి. స్క్రబ్బర్ వాడకూడదు. వాషింగ్ కోసం తేలికపాటి లిక్విడ్ అవసరం. జిడ్డుపోకపోతే వేడి నీటితో కడగండి.
(6 / 7)
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వంట చేసిన నాన్‌స్టిక్ పాత్రలను సింక్‌లో నీటి కింద ఉంచకూడదు. ఎందుకంటే వేడి-చల్లని షాక్ కూడా పూతను తొలగించగలదు. . నాన్‌స్టిక్ పాన్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కడగాలి.
ఇతర గ్యాలరీలు