AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ భేటీ - పోలవరంపై కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌-key decisions were approved in the ap cabinet meeting july 24th 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Cabinet Decisions : ఏపీ కేబినెట్ భేటీ - పోలవరంపై కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ భేటీ - పోలవరంపై కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

Jul 25, 2024, 08:12 PM IST Maheshwaram Mahendra Chary
Jul 25, 2024, 08:12 PM , IST

  • AP Cabinet Meeting Updates : ఏపీ సీఎం చంద్రబాబు  అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్, కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ప్రధానంగా చర్చ సాగింది. పోలవరం కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ సీఎం చంద్రబాబు  అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 

(1 / 6)

ఏపీ కేబినెట్ భేటీలో పోలవరం ప్రాజెక్ట్, కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ప్రధానంగా చర్చ జరిగింది. పోలవరం కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

(2 / 6)

పోలవరం కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలన్న టెక్నికల్‌ కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది.  దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను కొత్తగా నిర్మించాలని నిర్ణయించింది.  కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణా అంశాన్ని నీతి ఆయోగ్‌ సమావేశంలో సర్కార్ ప్రతిపాదించనుంది. 

(3 / 6)

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి, ఇతర పథకాలకు బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వటంపై కూడా అభినందిస్తూ తీర్మానం చేశారు. కేంద్ర నిధుల విషయంలోనూ సమన్వయం చేసుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

(4 / 6)

జులై 27వ తేదీన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పెట్టే ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చించి… ఆమోదముద్ర వేశారు. 

(5 / 6)

కేబినెట్ భేటీ కంటే ముందు ఏపీ అసెంబ్లీలో గురువారం శాంతి భద్రతలకు సంబంధించి సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ కింగ్ పిన్ తో జగన్ ను పోల్చారు. పాబ్లో ఎస్కోబార్ కొలంబియన్ రాజకీయ నాయకుడు అయ్యి డ్రగ్ కారిడార్‌లు ఏర్పాటు చేశాడని,… 30 బిలియన్ డాలర్లు సంపాదించి 1977లో అరెస్టు అయ్యాడని  గుర్తు చేశారు.  కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడని,,,, తరువాత 1986లో కొలంబియా న్యాయమంత్రిని చంపాడని చెప్పుకొచ్చారు. ఎస్కోబార్  మాదిరిగానే  జగన్ కూడా హానికరమైన వ్యక్తి  అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు