తెలుగు న్యూస్ / ఫోటో /
Jeep Compass SUVలో 'నైట్ ఈగిల్' ఎడిషన్ వచ్చేసింది!
- జీప్ కంపాస్ SUVలో 'నైట్ ఈగిల్' ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేశారు. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 18.04 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
- జీప్ కంపాస్ SUVలో 'నైట్ ఈగిల్' ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేశారు. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 18.04 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
(1 / 7)
గతంలో జీప్ కంపాస్ వాహనంలో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో నైట్ ఎడిషన్‌ను 2020లో విడుదల చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం పలు కాస్మెటిక్ మార్పుల చేసి సరికొత్తగా ఆవిష్కరించారు.
(2 / 7)
సరికొత్త జీప్ కంపాస్ నైట్ ఈగిల్ వెర్షన్‌లో గ్రిల్, గ్రిల్ రింగ్‌లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్, ORVMలు ఇంకా ఫాగ్ ల్యాంప్ బెజెల్స్ అన్నీ కూడా కారుమబ్బు రంగులో గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్ తో ఇచ్చారు.
(3 / 7)
పూర్తిగా నలుపు రంగులో ఉండే ఈ కంపా జీప్ కంపాస్ SUV క్యాబిన్ లోపల 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో మిగతా అన్నీ ఫీచర్లు ఎప్పట్లాగే ఉంటాయి.
(4 / 7)
నైట్ ఈగల్ వాహనంలో డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆల్-స్పీడ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఇంకా ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు సంబంధించు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లను కూడా అందిస్తున్నారు.
(5 / 7)
నైట్ ఈగిల్ వాహనంలో పియానో బ్లాక్ ఇంటీరియర్‌తో పాటు బ్లాక్ క్లాత్/వినైల్ సీట్‌లతో లైట్ టంగ్‌స్టన్ స్టిచింగ్ డోర్, IP కోసం బ్లాక్ వినైల్ ఇన్‌సర్ట్‌లను ఇచ్చారు.
(6 / 7)
జీప్ కంపాస్ నైట్ ఈగిల్ SUVలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసిన 2.0L మల్టీజెట్ టర్బో డీజిల్ వేరియంట్ అలాగే 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేసిన 1.4L మల్టీఎయిర్ టర్బో పెట్రోల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు