మూడు వరుసల సీట్లతో Hyundai Palisade SUV, హార్స్ పవర్ కూడా ఎక్కువే ఈ కారుకి!-2023 hyundai palisade suv makes world debut with fresh look ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  2023 Hyundai Palisade Suv Makes World Debut With Fresh Look

మూడు వరుసల సీట్లతో Hyundai Palisade SUV, హార్స్ పవర్ కూడా ఎక్కువే ఈ కారుకి!

Apr 14, 2022, 08:16 PM IST HT Auto Desk
Apr 14, 2022, 08:16 PM , IST

  • ప్రముఖ కార్ మేకర్ హ్యుందాయ్ నుంచి తమ బ్రాండ్ నుంచి ఎంతో గంభీరంగా కనిపించే 2023 పాలిసేడ్ SUV కారును ఆవిష్కరించింది. ఈ SUVలో రిమోట్ ఇంటెలిజెంట్ పార్కింగ్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్‌తో సహా ఎన్నో అధునాతనమైన డ్రైవర్-సహాయ సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి.

మూడు-వరుసల సీట్లతో ఉండే పాలిసేడ్ SUVకి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రస్తుతం జరుగుతున్న న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించింది. మూడు-వరుసల హ్యుందాయ్ పాలిసేడ్ SUV మొదటిసారిగా 2018లో ప్రారంభమైంది.

(1 / 8)

ఈ SUV బాడీ డిజైన్ విషయానికొస్తే, 2023 హ్యుందాయ్ పాలిసేడ్‌లో కొత్తగా ఫ్రంట్ గ్రిల్, హెడ్‌లైట్లు, పగటిపూట రన్నింగ్ లైట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ ఇచ్చారు. ఈ కారు అద్దాలు ఎండకు తగినట్లుగా ఆటోమేటిక్ డిమ్మింగ్ ఫంక్షనాలిటీని కలిగి ఉన్నాయి.

(2 / 8)

పాలిసేడ్ హ్యుందాయ్ ప్రత్యేకమైన డిజిటల్ కీ ఫీచర్ ఉంది. దీనివలన కార్ యజమానులు ప్రతీసారి కార్ కీని ఉపయోగించాల్సిన అవసరం లేదు. తమ కార్ కీని ఇంటి వద్దే ఉంచవచ్చు. ఏదైనా iPhone, Apple Watch లేదా Samsung Galaxy స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి కూడా ఈ కారును అన్‌లాక్ చేయవచ్చు అలాగే ఇంజన్ స్టార్ట్ ఇంకా ఆఫ్ కూడా చేయవచ్చు.

(3 / 8)

ఈ భారీ హ్యుందాయ్ పాలిసేడ్ కారులో 3.8-లీటర్ V6 అట్కిన్సన్ సైకిల్, డ్యూయల్ CVVT, డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 291 హార్స్పవర్ వద్ద 355 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని అంచనా. ఇందులో మల్టీ-డిస్క్ టార్క్ కన్వర్టర్ ఉంటుంది. అలాగే ఇంజన్ కు ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. అంటే 8 ఆటోమేటిక్ గేర్లు ఉన్నాయి.

(4 / 8)

ఈ కార్ లోపలి భాగంలో మూడు వరుసలుగా మొత్తం ఎనిమిది-సీట్ల కెపాసిటీ ఉంటుంది. డ్రైవర్ సీటు ఎర్గోనామిక్ మోషన్‌ను కలిగి ఉంది. క్యాబిన్ భాగంలో 12-అంగుళాల నావిగేషన్ స్క్రీన్, వైఫై యాక్సెస్ పాయింట్, డిజిటల్ కీబోర్డ్ 2 టచ్, వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూలింక్ ఫంక్షన్‌ తదితర స్పెసిఫికేషన్లు ఇచ్చారు.

(5 / 8)

2023 హ్యుందాయ్ పాలిసేడ్‌లో రెండవ-వరుస సీట్లు ఆర్మ్‌రెస్ట్ యాంగిల్ అడ్జస్టర్‌ని కలిగి ఉన్నాయి. మూడవ వరుస సీట్లు హీట్ ఫంక్షనాలిటీని కలిగి ఉన్నాయి.

(6 / 8)

2023 హ్యుందాయ్ పాలిసేడ్ SUVలో సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో పాటు గేజ్ క్లస్టర్, ఆడియో ఇంటర్‌ఫేస్ డిజైన్‌ను ఇచ్చారు.

(7 / 8)

పాత మోడెల్ కారుతో పోలిస్తే 2023 హ్యుందాయ్ పాలిసేడ్ స్టీరింగ్ వీల్ డిజైన్‌, సీట్ మెటీరియల్‌లలో మార్పు ఉంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు