తెలుగు న్యూస్ / ఫోటో /
Asian Games Hockey: సెమీస్‍లో భారత్ ఘన విజయం.. ఫైనల్ చేరిన టీమిండియా.. పతకం ఖరారు
- Asian Games IND vs Korea: ఏషియన్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు దూసుకుపోతోంది. చైనాలోని హంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలు జరుగుతుండగా.. నేడు (అక్టోబర్ 4) జరిగిన పురుషుల హాకీ సెమీ ఫైనల్‍లో టీమిండియా 5-3 తేడాతో దక్షిణ కొరియాపై ఘన విజయం సాధించింది. ఫైనల్ చేరింది. పతకాన్ని పక్కా చేసుకుంది. ఆ వివరాలివే..

(1 / 7)
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సత్తాచాటుతోంది. నేడు (అక్టోబర్ 4) దక్షిణ కొరియాతో జరిగిన సెమీఫైనల్‍లో భారత్ ఘన విజయం సాధించింది.(PTI)
(3 / 7)
ఈ మ్యాచ్‍లో భారత్ తరఫున హార్దిక్ సింగ్ (5వ నిమిషం), మన్‍దీప్ సింగ్ (11వ ని.), లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (15వ ని.), అమిత్ రోహిదాస్ (24వ ని.), అభిషేక్ (54వ ని.) గోల్స్ చేశారు. (PTI)
(4 / 7)
దక్షిణ కొరియా తరఫున మాంజే జంగ్ (17వ, 20వ, 42వ నిమిషాల్లో) ఒక్కడే మూడో గోల్స్ చేశాడు. ఇక ఆది నుంచి దూకుడుగా ఆడిన భారత జట్టు 5 గోల్స్ చేసి విజయం సాధించింది. (PTI)
(5 / 7)
ఈ గెలుపుతో ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు ఫైనల్ చేరింది. దీంతో పతకాన్ని ఖరారు చేసుకుంది. రెండో సెమీఫైనల్‍లో జపాన్, చైనా పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుతో ఫైనల్‍లో తలపడనుంది భారత జట్టు. (PTI)
(6 / 7)
భారత పురుషుల జట్టు ఫైనల్‍లో గెలిస్తే స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఓడినా రజత పతకం దక్కుతుంది. అక్టోబర్ 6న ఫైనల్ జరగనుంది. (PTI)
ఇతర గ్యాలరీలు