తెలుగు న్యూస్ / ఫోటో /
Eid-ul-Fitr celebrations: భారత్ లో ఆనందోత్సాహాలతో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు
- Eid-ul-Fitr celebrations: నెలవంక దర్శనమైన మర్నాడు రంజాన్ పండుగను జరుపుకుంటారు. నెలవంక దర్శనం పవిత్ర రంజాన్ మాసం ముగింపును సూచిస్తుంది. ఆ మర్నాడు షవ్వాల్ మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ ను జరుపుకుంటారు. ఇది ఇస్లామిక్ సంస్కృతిలో అంతర్భాగమైన సంప్రదాయం.
- Eid-ul-Fitr celebrations: నెలవంక దర్శనమైన మర్నాడు రంజాన్ పండుగను జరుపుకుంటారు. నెలవంక దర్శనం పవిత్ర రంజాన్ మాసం ముగింపును సూచిస్తుంది. ఆ మర్నాడు షవ్వాల్ మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ ను జరుపుకుంటారు. ఇది ఇస్లామిక్ సంస్కృతిలో అంతర్భాగమైన సంప్రదాయం.
(1 / 9)
ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు, దేశవ్యాప్తంగా మసీదులు, బహిరంగ ప్రదేశాలలో ప్రార్థనలు చేస్తారు. మహారాష్ట్రలోని థానేలోని ఈద్గా మసీదులో రంజాన్ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న పిల్లలు.(Praful Gangurde/HT Photo)
(2 / 9)
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న జామా మసీదులో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు (నమాజ్) లో పాల్గొన్న దృశ్యం.(Sunil Ghosh/HT Photo)
(3 / 9)
హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న సెక్టార్-29 మైదానంలో లీజర్ వ్యాలీ పార్క్ సమీపంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న దృశ్యం(Parveen Kumar/HT Photo)
(4 / 9)
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు థానే పోలీసులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.(Praful Gangurde/HT Photo)
(5 / 9)
ఢిల్లీలోని జామా మసీదులో నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న దృశ్యం.(Sanjeev Verma/HT Photo)
(6 / 9)
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా న్యూఢిల్లీలోని జామా మసీదు వద్ద నమాజ్ చేస్తున్న ముస్లింలు.(Sanjeev Verma/HT Photo)
(7 / 9)
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా అమృత సర్ లోని ఖైరుద్దీన్ మసీదులో ముస్లింలు గురువారం ఉదయం ప్రార్థనలు చేశారు.(Sameer Sehgal/HT Photo)
(8 / 9)
రంజాన్ చివరి రోజున ముస్లింలు ఇఫ్తార్ విందుతో ఉపవాస దీక్ష విరమించే ముందు నోయిడాలోని సెక్టార్ 8లో ఉన్న జామా మసీదులో ప్రార్థనలు చేశారు.(Sunil Ghosh/HT Photo)
ఇతర గ్యాలరీలు