In Pics : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం-here is tirumala brahmostavalu chakra snanam photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  In Pics : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

In Pics : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Oct 05, 2022, 06:26 PM IST HT Telugu Desk
Oct 05, 2022, 06:26 PM , IST

  • Tirumala Brahmostavam 2022 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

(1 / 8)

అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

(2 / 8)

ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.

(3 / 8)

అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

(4 / 8)

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు.

(5 / 8)

అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద జీయర్‌ స్వామి, చిన్న జీయర్ స్వామి పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

(6 / 8)

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

(7 / 8)

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడాలనే ఉద్దేశంతో చక్రస్నానం నిర్వహించారు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు