తెలుగు న్యూస్ / ఫోటో /
Ration Cards : రేషన్ కార్డు ఉందా..! మీకో గుడ్ న్యూస్, త్వరలోనే సరికొత్త సేవలు
- రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. 24 గంటలపాటు రేషన్ పొందేలా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తొలుత ఈ సేవలను ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరంలో ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ యోచిస్తోంది.
- రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. 24 గంటలపాటు రేషన్ పొందేలా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తొలుత ఈ సేవలను ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరంలో ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ యోచిస్తోంది.
(1 / 5)
తెలంగాణలో ఇటీవలే కొత్త రేషన్ కార్డులపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. కొత్త కార్డులను త్వరితగతిన ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డు ఉన్నవారికి సరికొత్త సేవలను అందించాలనే యోచనలో సర్కార్ ఉంది.
(2 / 5)
రేషన్ పంపిణీలో సరికొత్త సేవలను అమలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం గ్రెయిన్ ఏటీఎంలను ప్రయోగత్మకంగా ప్రారంభించే యోచనలో ఉంది. ముందుగా వీటిని హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారు.
(3 / 5)
ముఖ్యంగా ఈ గ్రెయిన్ ఏటీఎంలతో వలసదారుల కష్టాలు తీరుతాయి. వీటి ద్వారా లబ్దిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. 24 గంటల పాటు 365రోజుల పాటు రేషన్ పొందవచ్చు. ఇది ఒక ఏటీఎం మాదిరిగా పని చేస్తుంది.
(4 / 5)
సాధారణ లబ్దిదారులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు వీటి ద్వారా రేషన్ పొందవచ్చు. ముఖ్యంగా నగరంలో వలసదారులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రయోగత్మకంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
(5 / 5)
ఈ గ్రెయిన్ ఏటీఎంను దేశంలోనే తొలిసారిగా(ఆగస్టు 09, 2024) ఒడిశా లో ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా భువనేశ్వర్ లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు. ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ ను బియ్యం ఏటీఎం స్కీన్ పై ఎంట్రీ చేయాలి. ఆ తరువాత వేలిముంద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతీ రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు. ఇది విజయవంతమైతే ఒడిశాలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. ఈ విధానం ద్వారా రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. తెలంగాణే కాకుండా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు