తెలుగు న్యూస్ / ఫోటో /
Natural Glow | మేకప్ లేకుండానే అందంగా కనిపించాలా? ఈ టిప్స్ పాటించండి!
- మేకప్ వేయడం వల్లనే ముఖంలో కాంతి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఎలాంటి మేకప్ అవసరం లేకుండా సహజంగా మేకప్ వేసుకున్నంత మెరుపును పొందవచ్చు. అందుకు ఇక్కడ పేర్కొన్న ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు.
- మేకప్ వేయడం వల్లనే ముఖంలో కాంతి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఎలాంటి మేకప్ అవసరం లేకుండా సహజంగా మేకప్ వేసుకున్నంత మెరుపును పొందవచ్చు. అందుకు ఇక్కడ పేర్కొన్న ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు.
(1 / 8)
ప్రతీసారి మేకప్ ద్వారా ముఖాన్ని కవర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. తరచుగా మేకప్ వేసుకుంటే చర్మం నాణ్యత క్షీణిస్తుంది. కాబట్టి సహజ మార్గాల్లో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి చిట్కాలను మేము మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం.
(2 / 8)
పచ్చి పాలు చర్మానికి 'స్కిన్ సీరం'లా పనిచేస్తాయి. రోజుకు ఒకసారి పచ్చి పాలను 10 నిమిషాల పాటు చర్మానికి అప్లై చేయాలి. చేతులు, పాదాలకు కూడా పూయవచ్చు
(3 / 8)
అలోవెరా జెల్ అప్లై చేయడం ద్వారా చర్మ సమస్యలు నయం అవుతాయి. చర్మం కూడా మెరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా అలోవెరా జెల్‌ని ముఖానికి పట్టించి మసాజ్ చేయండి.
(4 / 8)
లోపలి నుండి చర్మాన్ని శుభ్రం చేయడానికి ఆవిరి పట్టండి. అయితే ప్రతిరోజూ ఆవిరి పటాల్సిన అవసరం లేదు, మూడు రోజుల గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఆవిరి పట్టే ముందు క్లెన్సర్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
(5 / 8)
మీ ముఖంపై మొటిమలు లేదా మచ్చలు ఉంటే, టీ ట్రీ ఆయిల్‌ను ముఖానికి అప్లై చేయాలి. నైట్ క్రీంలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి ముఖానికి రాసుకోవాలి.
(6 / 8)
విటమిన్-ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తేలికపాటి ఫేస్ వాష్‌లో ఉంచవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు విటమిన్ క్యాప్సూల్ ఉపయోగించవద్దు.
(7 / 8)
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ : మీ ముఖంలో పింక్ గ్లో పొందాలనుకుంటే, బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ మంచి ఛాయిస్ అవుతుంది. సగం బీట్‌రూట్ రసం తీసి, దానికి ఒక చెంచా అలోవెరా జెల్, పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. దీనిని 20 నిమిషాల పాటు ఉంచాలి. మూడు రోజులకు ఒకసారి చేస్తే మార్పు చూడవచ్చు.
ఇతర గ్యాలరీలు