తెలుగు న్యూస్ / ఫోటో /
పీరియడ్స్ సమయంలో ఆ సమస్య వేధిస్తుందా? అయితే ఇవి ఫాలో అయిపోండి..
నెలసరి సమయంలో స్త్రీలకు కడుపు నొప్పి, తలనొప్పి, బలహీనత రావడం సర్వసాధారణం. కానీ కొంతమంది స్త్రీలు ఆ సమయంలో యోని నుంచి దుర్వాసనను అనుభవిస్తారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. కచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
నెలసరి సమయంలో స్త్రీలకు కడుపు నొప్పి, తలనొప్పి, బలహీనత రావడం సర్వసాధారణం. కానీ కొంతమంది స్త్రీలు ఆ సమయంలో యోని నుంచి దుర్వాసనను అనుభవిస్తారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. కచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
(1 / 6)
బహిష్టు సమయంలో మహిళలు అలసటతో పాటు పలు సమస్యలతో బాధపడుతుంటారు. ఇవి సరిపోదు అన్నట్లు కొంతమంది మహిళలు ఋతుస్రావం సమయంలో తీవ్రమైన యోని వాసనను అనుభవిస్తారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. (HT)
(2 / 6)
నెలసరి సమయంలో రక్తంలో ఐరన్ లేకపోవడం వల్ల యోని దుర్వాసన వస్తుంది. దీనిని అధిగమించాలంటే ఖర్జూరం, బెల్లం తినాలి. అదనంగా మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సమస్య మరింత వేధిస్తుంటే వైద్యుని సహాయం తప్పక తీసుకోవాలి. అయితే ఇంట్లోనే ఆ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. (HT)
(3 / 6)
పీరియడ్స్ సమయంలో ఎక్కువసేపు ఒకే ప్యాడ్‌ని ఉపయోగించవద్దు. ఎందుకంటే దాని వల్ల కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యోని దుర్వాసన బ్యాక్టీరియా సమస్య వల్ల కూడా రావచ్చు. ఒకవేళ ఈ సమస్య మరింత బాధిస్తుంటే తప్పక వైద్యుని సలహా తీసుకోవాలి.(HT)
(4 / 6)
ఋతుస్రావం సమయంలో పొత్తికడుపులో అసౌకర్యం, అధిక రక్తస్రావం అనుభవిస్తుంటే.. మీరు మీ డైట్‌ని మార్చుకోవాలి. అంతేకాకుండా శుభ్రమైన నీటితో లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే ప్యాడ్‌లను నిర్ణీత వ్యవధిలో మార్చాలి.(HT)
(5 / 6)
నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అధిగమించాలంటే మహిళలు ఎప్పుడూ ప్రైవేట్ పార్ట్‌లను శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ శుభ్రంగా ఉతికిన బట్టలను ధరించాలి. (HT)
ఇతర గ్యాలరీలు