Ayurvedic remedies : చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుందా? అయితే ఇవి ఫాలో అయిపోండి..
- జుట్టు రాలడానికి ప్రధాన సమస్య చుండ్రు. ఇది ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే.. తల అంతా దురద వచ్చి.. జుట్టు రాలిపోయేలా చేస్తుంది. పైగా ఒక్కసారి వచ్చిందంటే అంత తేలికగా పోదు. అయితే ఆయుర్వేదంలో చిటికెలో చుండ్రును తొలగించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఈ చిట్కాలను ఫాలో అయిపోండి.

(1 / 7)
చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. వారికి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. అయితే మీ చేతిలోనే సులభమైన పరిష్కారముంది అంటుంది ఆయుర్వేద శాస్త్రం.
(2 / 7)
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో చుండ్రు ఒకటని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది అంటున్నారు నిపుణులు.
(3 / 7)
వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి తలకు పట్టించాలి. ఇది చుండ్రును తగ్గిస్తుంది.
(4 / 7)
త్రిఫల చూర్ణం చుండ్రును పోగొట్టడంలో మంచిగా సహాయం చేస్తుంది. ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు పెరుగులో రాత్రంతా నానబెట్టండి. ఆ మిశ్రమాన్ని ఉదయాన్నే తలకు పట్టించాలి. అరగంట ఉంచి కడిగేయండి. ఇది చుండ్రును తగ్గిస్తుంది.
(5 / 7)
ఒక కప్పు అలోవెరా జెల్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలపండి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తలకు పట్టించాలి. తర్వాత ఉదయాన్నే షాంపూతో తలను కడిగేయాలి.
(6 / 7)
మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. ఉదయం వాటిని పేస్ట్ చేసి.. దానిలో కొద్దిగా అలోవెరా జెల్ కలపాలి. తలపై అప్లై చేసి.. గంటసేపు అలాగే ఉంచి షాంపూతో కడగాలి.
ఇతర గ్యాలరీలు