తెలుగు న్యూస్ / ఫోటో /
ట్విట్టర్ విషయంలో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం!
ట్విట్టర్ విషయంలో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలో వాటా కొనుగోలు చేసిన తర్వాత ఆయన బోర్డులో చేరతారని అందరూ భావించారు. కానీ ఎలోన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు
ట్విట్టర్ విషయంలో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలో వాటా కొనుగోలు చేసిన తర్వాత ఆయన బోర్డులో చేరతారని అందరూ భావించారు. కానీ ఎలోన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు
(1 / 6)
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ 9.2 శాతం వాటాలు కొనగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తానే మేజర్ షేర్ హోలర్డ్‌గా ఉన్నాడు కాబట్టి ఎలోన్ మస్క్ ట్విట్టర్ స్టీరింగ్ కమిటీలో అనుకున్నప్పటికీ దానికి విరుద్దంగా తాను బోర్డులో చేరనని తెల్చి చెప్పాడు.(REUTERS)
(2 / 6)
ఈ మేరకు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఎలోన్ చేరిక కోసం బోర్డులో ఏర్సాట్లు జరిగాయి... అయితే ఫార్మాలిటీలు పూర్తికాకముందే, తను బోర్డులో చేరడం ఇష్టం లేదని ఎలోన్ ప్రకటించారు.(Twitter)
(3 / 6)
ఈ విషయంపై స్పందించిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్. ఎలోన్ కంపెనీ అతి పెద్ద వాటాదారు. అతనికి 9.2% వాటా ఉన్నాయి. అయితే అతను బోర్డులో లేకపోయినా షేర్‌హోల్డర్ల అభిప్రాయానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని.. అతని సలహా తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.(REUTERS/Stephen Lam)
(4 / 6)
ఎలోన్ మస్క్ పెట్టుబడి తర్వాత ట్విట్టర్ షేర్లు ఒక్కసారిగా 26% పెరిగాయి. ఎలోన్ మస్క్ దాదాపు 63.5 మిలియన్ల ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేశారు. ఎలోన్ మస్క్ సాధరణంగా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి రోజు ఒకటి కంటే ఎక్కువసార్లు ట్వీట్‌లు చేస్తుంటారు.(REUTERS/Mike Blake)
(5 / 6)
ట్విట్టర్‌లోని పలు నిబంధనలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కంపెనీలో వాటా కొనుగోలు చేసిన తర్వాత ఆయన బోర్డులో చేరతారని అందరూ భావించారు. కానీ ఎలోన్ అందరి ఇష్టాలకు విరుద్ధంగా నడుచుకున్నాడు.(REUTERS/Steve Nesius )
ఇతర గ్యాలరీలు