Elon musk | ట్విట్టర్‌కు ధీటుగా.. కొత్త సోషల్ మీడియా?
Elon Musk news | ఎలాన్ మస్క్ నుంచి కొత్త సోషల్ మీడియా యాప్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ఆయన చేసిన ఓ ట్వీట్ కారణం.
Elon Musk social media platform | టెస్లా సీఈఓ, ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. కొత్త సోషల్ మీడియా యాప్‌ను రూపొందించే విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు.
భావప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చి, వ్యక్తిగత ప్రయోజనాలు లేని, ఓపెన్ సోర్స్ ఆల్గొరిథంతో కూడిన సామాజిక మాధ్యమ వేదికను తీసుకొస్తారా? అని ఓ ట్విట్టర్ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు.. సమాధనంగా.. మస్క్ ఆ ట్వీట్ చేశారు.
ట్విట్టర్లో మస్క్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. కాగా గత కొంతకాలంగా.. ట్విట్టర్, సంస్థ విధానాలపై ఆయన విమర్శలు చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ విలువలను పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ట్విట్టర్‌పై అనేకమార్లు మండిపడ్డారు.
Elon Musk twitter | ఇదే విషయంపై ఆయన ట్విట్టర్లో ఓ పోల్ కూడా నిర్వహించారు. 'ట్విట్టర్.. ఫ్రీ స్పీచ్‌కు విలువ ఇస్తుందా?' అని ఆయన ప్రశ్నించారు. 'ఈ పోల్ అనంతర పరిణామాలు చాలా కీలకంగా ఉంటాయి, జాగ్రత్తగా ఓట్లు వేయండి,' అని పేర్కొన్నారు. మస్క్ అడిగి ప్రశ్నకు 70శాతం మంది యూజర్లు 'నో' అనే జవాబిచ్చారు. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే.. కొత్త సోషల్ మీడియా వేదిక గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు మస్క్ చెప్పడం గమనార్హం.
అనేకమంది ప్రముఖులు సొంతంగా తమ సోషల్ మీడియా యాప్‌లను తీసుకొస్తున్నారు. ఇటీవలే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 'ట్రూత్' పేరుతో ఓ యాప్‌ను విడుదల చేశారు. కాగా మస్క్ నిజంగానే యాప్‌ను తీసుకొస్తే.. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సామాజిక మాధ్యమాలకు పోటీ తప్పదు అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
సంబంధిత కథనం