తెలుగు న్యూస్ / ఫోటో /
Jasprit Bumrah: ‘అలాంటి పిచ్‍లపై కూడా..’: జస్‍ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‍ల ప్రశంసలు
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‍తో రెండో టెస్టులో తొమ్మిది వికెట్లతో అతడు సత్తాచాటాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‍ల్లో నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు మైకేల్ క్లార్క్, ఆరోన్ ఫించ్.. బుమ్రాను పొగిడేశారు.
(1 / 7)
విశాఖపట్నంలో ఇంగ్లండ్‍తో జరిగిన రెండో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 9 వికెట్లను పడగొట్టాడు. ఫ్లాట్ పిచ్‍పై కూడా అద్భుతమైన బౌలింగ్‍తో వికెట్లను రాబట్టి.. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అలాగే, ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరాడు. (PTI)
(2 / 7)
అద్భుత ప్రదర్శన చేస్తున్న జస్‍ప్రీత్ బుమ్రాపై చాలా మంది మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ప్రతిభకు ఫిదా అవుతున్నారు. తాజాగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు మైకేల్ క్లార్క్, ఆరోన్ ఫించ్ కూడా బుమ్రాను పొగిడారు. (REUTERS)
(3 / 7)
పేసర్లకు సహకరించని ఫ్లాట్ పిచ్‍లపై కూడా బుమ్రా అదరగొడుతున్నాడని క్లార్క్ అన్నాడు. అతడో వైవిధ్యమైన బౌలర్ అని కొనియాడాడు. టీమిండియాకు మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సులను చేస్తూనే ఉన్నాడని క్లార్క్ చెప్పాడు. బుమ్రా ఇప్పటి వరకు ఓ సంచలనంగా ఉన్నాడని చెప్పాడు. (AP)
(4 / 7)
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ పోప్‍ను బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో బౌల్డ్ చేయడం గురించి కూడా క్లార్క్ మాట్లాడాడు. క్రికెట్‍లో అది ఒకానొక బెస్ట్ బాల్‍గా ఉంటుందని అన్నాడు. ఈఎస్‍పీఎన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. (REUTERS)
(5 / 7)
బుమ్రాను ఎదుర్కోవడం బ్యాటర్లకు చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెప్పాడు. పరుగులు చేసే అవకాశాన్ని అతడు ఎక్కువగా ఇవ్వడని అన్నాడు. (PTI)
(6 / 7)
“బుమ్రా భయంకరమైన బౌన్సర్లు, యార్కర్లు వేయగడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. షార్ట్ రనప్ ఉన్న అతడు ఏ బ్యాటర్‌నైనా సర్‌ప్రైజ్ చేయగలడు” అని ఫించ్ చెప్పాడు. (PTI)
ఇతర గ్యాలరీలు