APPSC Group2: గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీలపై సందిగ్ధం, వాయిదా కోరుతూ కమిషన్‌కు వినతులు-confusion over dates of group 2 mains exam pleas to commission seeking postponement ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Appsc Group2: గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీలపై సందిగ్ధం, వాయిదా కోరుతూ కమిషన్‌కు వినతులు

APPSC Group2: గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీలపై సందిగ్ధం, వాయిదా కోరుతూ కమిషన్‌కు వినతులు

Nov 05, 2024, 12:02 PM IST Bolleddu Sarath Chandra
Nov 05, 2024, 12:02 PM , IST

  • APPSC Group2: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. పరీక్ష తేదీలను వాయిదా వేయాలంటూ పలువురు  ఎమ్మెల్సీలు, యువజన సంఘాలు కమిషన్ ఛైర్మన్‌కు వినతి పత్రాలు సమర్పించారు. కనీసం మూడు నెలల పాటు గ్రూప్‌ 2 ప్రిపరేషన్‌ గడువు ఉండేలా తేదీలను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

Dy.EO, JL,DLతో పాటుగా నిలిచి పోయిన నోటిఫికేషన్ సంబంధించి పరీక్ష షెడ్యూల్ ప్రకటించాలని, .2025‌ నుంచి UPSC మాదిరి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఇంజనీరింగ్ పట్టభద్రుల కోరిక మేరకు AEE ఖాళీల భర్తీ  చేయాలని వేపాడ చిరంజీవి ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను కోరారు. 

(1 / 7)

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే  అభ్యర్థుల వినతి మేరకు  కనీసం 90 రోజులు వ్యవధి ఇవ్వడం,   గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హులు జాబితాని 1:100 నిష్పత్తికి పెంచాలనిఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవి రావు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. 

(2 / 7)

ఏపీపీఎస్సీ  గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష జనవరి 5న జరుగుతుందా  లేదా అనే దానిపై  సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ మధ్య జరుగుతాయి . ఆ తర్వాత ఇంటర్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండవు. గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష రాసేవారిలో కొంత మంది డీఎస్సీకి కూడా హాజరవుతారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌ 2 మెయిన్స్ నిర్వహణ తేదీపై సందిగ్ధత నెలకొంది. 

(3 / 7)

ఏపీపీఎస్సీ  గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష జనవరి 5న జరుగుతుందా  లేదా అనే దానిపై  సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ మధ్య జరుగుతాయి . ఆ తర్వాత ఇంటర్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండవు. గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష రాసేవారిలో కొంత మంది డీఎస్సీకి కూడా హాజరవుతారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌ 2 మెయిన్స్ నిర్వహణ తేదీపై సందిగ్ధత నెలకొంది. (/unsplash.com/)

గ్రూప్‌2  మెయిన్స్ పరీక్ష తేదీలు ప్రకటించడంతో పాటు,  ప్రశ్నాపత్రం తర్జుమా విషయంలో దోషాలు లేకుండా చూడడం,  సిలబస్ ప్రామాణికంగా తీసుకొని ప్రశ్నాపత్రం ఇవ్వాలని, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అభ్యర్థుల ఎంపిక నిష్పత్తిని నిర్ణయించాలని,  ఏపీపీఎస్సీ సంబంధించిన సమాచారాన్ని లీకు కాకుండా Official Webnote ద్వారా మాత్రమే విడుదల చేయాలని ఎమ్మెల్సీలు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. 

(4 / 7)

గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలకు 3నెలల వ్యవధి కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. జనవరి 5న గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్‌ 30న ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రకటిత తేదీ నుంచి పరీక్ష రాసేందుకు మూడు నెలల వ్యవధి ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ గ్రూప్‌-2 వాయిదా వేస్తే ఏప్రిల్‌/మేలో మాత్రమే నిర్వహించేందుకు వీలవుతుంది. 

(5 / 7)

గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలకు 3నెలల వ్యవధి కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. జనవరి 5న గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్‌ 30న ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రకటిత తేదీ నుంచి పరీక్ష రాసేందుకు మూడు నెలల వ్యవధి ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ గ్రూప్‌-2 వాయిదా వేస్తే ఏప్రిల్‌/మేలో మాత్రమే నిర్వహించేందుకు వీలవుతుంది. (APPSC )

డీఎస్సీ రాత పరీక్షల తేదీలను ఖరారు చేయనున్న నేపథ్యంలో  గ్రూప్‌-2 తేదీలను మార్చాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించాలి అభ్యర్థుల వినతి మేరకు గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ఎమ్మెల్సీలు డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు, లక్ష్మణరావు ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌ అనురాధకు సోమవారం వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. 

(6 / 7)

డీఎస్సీ రాత పరీక్షల తేదీలను ఖరారు చేయనున్న నేపథ్యంలో  గ్రూప్‌-2 తేదీలను మార్చాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించాలి అభ్యర్థుల వినతి మేరకు గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ఎమ్మెల్సీలు డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు, లక్ష్మణరావు ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌ అనురాధకు సోమవారం వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. (istockphoto)

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, డీవైఈఓ పరీక్ష కటాఫ్‌ మార్కులు తగ్గించాలని ఎమ్మెల్సీలు కమిషన్ ఛైర్మన్‌ను కోరారు. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాము, కార్యదర్శి రామన్న కూడా ఛైర్మన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు