తెలుగు న్యూస్ / ఫోటో /
Bhanupriya: ఈ స్థార్ హీరోయిన్లకు భానుప్రియ తెలుగులో డబ్బింగ్ చెప్పింది- ఆ హీరోయిన్లు ఎవరంటే?
Bhanupriya: తెలుగులో 1980, 90 దశకంలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది భానుప్రియ. స్వర్ణకమలం, సితార, అన్వేషణ, ఖైదీ నంబర్ 786తో పాటు పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది.
(1 / 6)
గత కొన్నాళ్లుగా మెమొరీ లాస్ సమస్య కారణంగా సినిమాలు దూరంగా ఉంటోంది భాను ప్రియ. ఈ మెమొరీ లాస్ కారణంగా సిల్వైన్ శిల బన్ని సినిమా షూటింగ్ సెట్స్‌లో తన డైలాగ్స్ కూడా మర్చిపోయానని ఓ ఇంటర్వ్యూలో భాను ప్రియ చెప్పింది. మెమొరీ లాస్ కారణంగా తాను నేర్చుకున్న కూచిపూడి డ్యాన్స్ కూడా మర్చిపోయినట్లు భాను ప్రియ చెప్పింది.
(2 / 6)
1998లో అదర్శ్ కౌశల్‌ను పెళ్లిచేసుకున్నది భాను ప్రియడ. భర్త నుంచి భాను ప్రియ విడాకులు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదని భాను ప్రియ తెలిపింది. 2018లో భానుప్రియ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో చనిపోయాడు. భర్త చనిపోయినప్పటి నుంచి భాను ప్రియ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.
(3 / 6)
భాను ప్రియ కూతురు అభినయ ప్రస్తుతం లండన్‌లో నాచురల్ సైన్స్ విభాగంలో డిగ్రీ చదువుతోంది. తన కూతురు అభినయకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని భానుప్రియ అన్నది.
(4 / 6)
ఒకప్పుడు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది భానుప్రియ. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన శివకార్తికేయన్ అయలాన్‌లో హీరో తల్లి పాత్రను చేసింది
(5 / 6)
భారతీయుడులో ఊర్మిళ, అరుణాచలంలో సౌందర్య మెరపుకలలులో కాజల్ పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది.
ఇతర గ్యాలరీలు