Baby Photoshoot: కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లను కృష్ణుడిలా తయారు చేసి, ఇలా ఫొటోషూట్ చేసేయండి-best baby photoshoot ideas for sri krishnashtami ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Baby Photoshoot: కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లను కృష్ణుడిలా తయారు చేసి, ఇలా ఫొటోషూట్ చేసేయండి

Baby Photoshoot: కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లను కృష్ణుడిలా తయారు చేసి, ఇలా ఫొటోషూట్ చేసేయండి

Aug 20, 2024, 12:12 PM IST Koutik Pranaya Sree
Aug 20, 2024, 12:12 PM , IST

Krishnashtami baby photoshoot: శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చేస్తుంది. ఇంట్లో చిన్న పిల్లలను కృష్ణుడిలా ముస్తాబు చేసి ఫొటోలు తీయకపోతే ఎలా. కృష్ణాష్టమి ఫోటోషూట్ కోసం కొన్ని ఐడియాలు చూడండి. 

భారతీయ సంప్రదాయ దుస్తులైన ధోతీని కట్టండి. తెలుపు రంగు దోతీ పరవాలేదు. కానీ శ్రీ కృష్ణుడి రూపం కనిపించాలంటే నీలం, ఎరుపు కాంబినేషన్లలో చూడండి. ఇవి మంచి కళ తీసుకొస్తాయి. 

(1 / 7)

కిరీటం మీ చిన్ని కృష్ణుని అందాన్ని పెంచుతుంది. అందుకే నెమలి ఈకలతో కిరీటాన్ని తయారు చేసి పిల్లల తలకు కట్టాలి.మీరు చాలా చిన్న పిల్లలైతే  తలకు పాగా కట్టి దానికి నెమలి ఈకను పెట్టండి.

(2 / 7)

ఫొటోషూట్ కోసం వాళ్ల ముందు ఒక కుండను ఉంచాల్సిందే. ఒక మట్టి కుండను తెచ్చి అందంగా అలంకరించండి. దానిలో కొంత వెన్న లేదా వెన్న లాగే కనిపించే దూదిని నింపి మీ పిల్లల చేతిలో ఉంచండి. వారు దానితో ఆడుకుంటున్నప్పుడు ఫోటో తీయండి. 

(3 / 7)

వేణువు: కృష్ణుడు అంటే ముందు గుర్తొచ్చేది చేతిలో వేణువు. అందమైన వెదురుతో చేసిన వేణువును తెచ్చి మీ పిల్లల నడుము దగ్గర కట్టండి. లేదా వాళ్ల చేతుల్లో పెట్టండి.

(4 / 7)

అవుట్ డోర్: ఇంటి లోపలే కాదు.. బయట కూడా పిల్లల ఫోటో తీయొచ్చు. అవి నేచురల్ గా, అందంగా కనిపిస్తాయి. ఇంటి లోపల ఏం చేసినా అది అంత నేచురల్ గా కనిపించదు. వీలైతే దగ్గర్లోని పార్క్ లో, లేదంటే టెర్రాస్ లో షూట్ చేయండి. 

(5 / 7)

ముత్యాల నెక్లెస్: బంగారు నెక్లెస్ కంటే ముత్యాల నెక్లెస్ ఎక్కువ అందాన్ని ఇస్తుంది. పిల్లలను గుచ్చదు కూడా. అందుకే, ముత్యాల నెక్లెస్ ను ఎంచుకోండి.  చిన్నారి నుదుటిపై తిలకం వేయడం మర్చిపోకండి.

(6 / 7)

నెమలి ఈక: మీ బిడ్డ చాలా చిన్నవాడైతే నీలిరంగు గుడ్డపై పడుకోబెట్టండి. వాళ్ల పక్కన పెద్ద నెమలి ఈకను ఉంచండి. కిరీటం పెట్టి శరీరం చుట్టూ కండువాతో పాటూ దోతీ కట్టండి. .ఇలా సింపుల్ గా చేసినా అందంగా కనిపిస్తుంది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు