Ego Clash Movies: ఈగో క్లాష్ కాన్సెప్ట్‌తో వచ్చిన బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?
Ego Clash Movie: ఈగో క్లాష్ బాక్సాఫీస్ సక్సెస్ మంత్రగా మారింది. ఈగో సమస్యలతో వచ్చిన మలయాళం, తమిళ సినిమాలు రికార్డు కలెక్షన్స్ రాబట్టాయి. తెలుగులో రీమేకయ్యాయి. ఈగో క్లాష్‌తో వచ్చి సక్సెస్ అయిన సినిమాలు ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
(1 / 4)
ఈగో క్లాష్ కాన్సెప్ట్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్, బీజుమీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో పాటు నాలుగు నేషనల్ అవార్డులను అందుకున్నది. ఈ సినిమాను తెలుగులో భీమ్లానాయక్ పేరుతో పవన్ కళ్యాణ్, రానా రీమేక్ చేశారు. అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
(2 / 4)
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ సూపర్ స్టార్‌కు, మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌కు మధ్య ఏర్పడిన ఈగో ఎలాంటి సమస్యలకు దారితీసిందనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో సూరజ్ వెరంజమూడు మరో హీరోగా కనిపించాడు.
(3 / 4)
ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మలయాళం మూవీ మహేషింతే ప్రతీకారం కూడా ఈగో సమస్యలతోనే వచ్చి హిట్ కొట్టింది. తన ఈగోను దెబ్బతీసిన ఓ రౌడీపై సాధారణ ఫొటోగ్రాఫర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ కథ. ఈ ఫహాద్ ఫాజిల్ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.
(4 / 4)
తమిళంలో చిన్న సినిమాగా వచ్చిన పార్కింగ్ మంచి వసూళ్లను రాబట్టింది. హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. పార్కింగ్ విషయంలో ఓ ప్రభుత్వ ఉద్యోగితో గొడవ పడిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ జీవితం చివరకు ఎలా ముగిసిందన్నది దర్శకుడు ఎమోషనల్‌గా ఈ మూవీలో చూపించాడు.
ఇతర గ్యాలరీలు