తెలుగు న్యూస్ / ఫోటో /
TG AP Weather Updates : ఉపరితల ఆవర్తనం... ఆపై అల్పపీడనం..! ఏపీకి భారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరికలు
- AP Telangana Rains : ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అక్టోబర్ 20వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, రాయలసీమ మీదుగా ద్రోణి కూడా కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rains : ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అక్టోబర్ 20వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, రాయలసీమ మీదుగా ద్రోణి కూడా కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు కర్ణాటక, సీమ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది.
(2 / 7)
ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అక్టోబర్ 20వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో అక్టోబర్ 22వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అవకాశం ఉందని అంచనా వేసింది.
(3 / 7)
ఏపీలో ఇవాళ(అక్టోబర్ 18) కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు, ఎన్టీఆర్,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 7)
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(5 / 7)
తెలంగాణలో ఇవాళ(అక్టోబర్ 18) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 7)
ఇక రేపు(అక్టోబర్ 19) తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు