CMRF Donations : సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.3 వేలు అందించిన పదో తరగతి విద్యార్థిని, విరాళాలు ప్రకటించిన హీరోలు
- CMRF Donations : తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది సర్వస్వం కోల్పోయారు. ఆపదసమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితుల కోసం సామాన్యుడి నుంచి సినీ హీరోల వరకూ కదిలారు. సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
- CMRF Donations : తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది సర్వస్వం కోల్పోయారు. ఆపదసమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితుల కోసం సామాన్యుడి నుంచి సినీ హీరోల వరకూ కదిలారు. సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
(1 / 7)
తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది సర్వస్వం కోల్పోయారు. ఆపదసమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితుల కోసం సామాన్యుడి నుంచి సినీ హీరోల వరకూ కదిలారు. సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
(2 / 7)
ఈ క్లిష్ట సమయంలో సాటి మనిషిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సురక్షిత ప్రాంతాలలో ఉన్నవారు బాధిత కుటుంబాలకు సాయం చేయాలని కోరారు.
(3 / 7)
ఏపీలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.1 కోటి విరాళం అందచేశారు.
(4 / 7)
వరద బాధితులకు విరాళంగా విజయవాడకు చెందిన విజయలక్ష్మీ, నిర్మలాదేవి, రాణి అనే ముగ్గురు అక్కాచెళ్లెళ్లు ఒక్కొక్కరు రూ.50వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందచేశారు. వారి దాతృత్వానికి సీఎం అభినందనలు తెలిపారు.
(5 / 7)
భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం రూ. 130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు మహబూబాబాద్ లో ముఖ్యమంత్రి కలిసి ఈ మేరకు సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు.
(6 / 7)
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న రూ.3 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ అమ్మాయిని అభినందించారు.
(7 / 7)
వరద బాధితులను ఆదుకునేందుకు సినీరంగ ప్రముఖులు ముందుకు వచ్చారు. హీరోలు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ , సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నిర్మాతలు, దర్శకులు విరాళాలు ప్రకటిస్తున్నారు. హీరో బాలకృష్ణ ఇరు రాష్ట్రాలకు చెరొక 50 లక్షల విరాళం ప్రకటించారు. జూ.ఎన్టీఆర్ రూ.కోటి, సిద్ధు జొన్నలగడ్డ రూ.30 లక్షలు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.కోటి, నిర్మాత ఎస్.రాధాకృష్ణ రూ. 50 లక్షలు, ఎస్.నాగ వంశీ రూ. 25 లక్షల చొప్పున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు