Ganesh Statues : 20 టన్నుల బొల్లంతో బొజ్జ గణపయ్య, వేరువేరు ఐటమ్స్ తో విగ్రహాలు ఏర్పాటు
- Ganesh Statues : రాష్ట్రంలో వినాయక చవితి ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వివిధ ఐటమ్స్ తో చేసి ప్రతిష్ఠించారు. బెల్లం, రుద్రాక్షలు, మట్టి గణపయ్యలు ప్రతిష్టించారు. ఎకో ఫ్రెండీ గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.
- Ganesh Statues : రాష్ట్రంలో వినాయక చవితి ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వివిధ ఐటమ్స్ తో చేసి ప్రతిష్ఠించారు. బెల్లం, రుద్రాక్షలు, మట్టి గణపయ్యలు ప్రతిష్టించారు. ఎకో ఫ్రెండీ గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.
(1 / 6)
రాష్ట్రంలో వినాయక చవితి ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వివిధ ఐటమ్స్ తో చేసి ప్రతిష్ఠించారు. గాజువాకలో 20 టన్నుల బెల్లంతో భారీ గణనాథుడు తయారు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఈ విగ్రహామే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖలోని గాజువాక ఆర్టీసీ డిపో పక్కన ఉన్న గ్రౌండ్లో 70 అడుగుల భారీ గణనాథుడు కొలువు తీరారు. విశాఖ ప్రజలు సందర్శనార్థం 21 రోజులు పాటు ఈ గణనాథుని కొలువు తీరుస్తున్నారు. కమిటీ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
(2 / 6)
ఏటా పర్యవరణ అనుకూల విగ్రహాలు తయారుచేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చెందిన తాపీమేస్త్రీ వీరబాబు రుద్రాక్షలతో వినాయకుడిని రూపొందించారు. రుద్రాక్షలను కాశీ నుంచి తెప్పించారు. రెండేళ్ల క్రితం 45 కిలోల వరిపిండితో మూడున్నర అడుగుల వినాయక విగ్రహం తయారు చేశారు. గత ఏడాది 30 కేజీల పసుపుతో విగ్రహం తయారు చేశారు. ఈ ఏడాది రుద్రాక్షలతో విగ్రహం చేశారు.
(3 / 6)
కాకినాడ జిల్లా పెద్దాపురంలో మట్టి విగ్రహం పెట్టి మానవసేవే మాధవ సేవ నినాదంతో విజయవాడ వరద బాధితులకు సహకరిద్దాం అంటూ వినాయక పందిరిలో సహాయ నిధి హుండీ ఏర్పాటు చేశారు.
(4 / 6)
వైజాగ్ జీవీఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. అలాగే జనసేన పార్టీ కూడా మట్టి విగ్రహాలనే పెట్టాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మట్టి విగ్రహాలు వెలిశాయి.
(5 / 6)
నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో అక్రూట్ తో మహాగణపతి విగ్రహం తయారు చేశారు.
ఇతర గ్యాలరీలు