Jio Cinema OTT: జియో సినిమా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న హాలీవుడ్ మూవీస్ ఇవే - ఈ హారర్ సినిమాను మిస్సవ్వొద్దు
రీసెంట్‌గా రిలీజైన కొన్ని హాలీవుడ్ మూవీస్ జియో సినిమా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్ కథాంశాలతో రూపొందిన ఆ సినిమాలు ఏవంటే?
(1 / 5)
హారర్ మూవీ అబిగైల్ జియో ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా ఉంది. అండర్‌వరల్డ్ డాన్‌పైపగతో అతడి కూతురిని కొందరు కిడ్నాప్ చేసి ఓ పాతకాలం నాటి బిల్డింగ్‌లో దాస్తారు. అక్కడ వారికి ఎలాంటి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి అన్నదే ఈ మూవీ కథ.
(2 / 5)
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ది అమెరికన్ సొసైటీ ఆఫ్ మ్యాజికల్ నీగ్రోస్ మూవీ జియో ఈ వారం జియో సినిమా ఓటీటీ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో జస్టిస్ స్మిత్, డేవిల్ అలన్ కీలక పాత్రల్లో నటించారు.
(3 / 5)
మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ది కిల్లర్ మూవీ జియో ఓటీటీలో ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. తనను చంపాలని ప్రయత్నించిన కొందరిపై ఓ అంధురాలనైన యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఆమెకు ఓ కాంట్రాక్ట్ కిల్లర్ ఎలా సాయం చేశాడనే కథాంశంతో ది కిల్లర్ మూవీ తెరకెక్కింది.
(4 / 5)
థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ది కలెక్టివ్ మూవీ ఇటీవలే జియో సినిమా ఓటీటీలో రిలీజైంది. డేంజరస్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను లేడీ ఏజెంట్ ఎలా ఎదుర్కొన్నదనే అంశాలతో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది.
ఇతర గ్యాలరీలు