(1 / 6)
చర్లపల్లిలో నిర్మించిన రైల్వేస్టేషన్ విమానాశ్రయాన్ని తలపించేలా ఉంది. ఈ స్టేషన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ తగ్గుతుంది.
(@kishanreddybjp)(2 / 6)
హైదరాబాద్‌కు తూర్పున చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఉంది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు.
(@kishanreddybjp)(3 / 6)
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే అవకాశం ఉందని.. అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది.
(@kishanreddybjp)(4 / 6)
చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించారు. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం కాబోతోంది.
(@kishanreddybjp)(5 / 6)
ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఎంఎంటీఎస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సాఫీగా రైల్వే స్టేషన్‌ను చేరుకునే అవకాశం ఉండనుంది.
(@kishanreddybjp)(6 / 6)
ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్ ఫాంలకు అదనంగా.. మరో 4 ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోంది.
(@kishanreddybjp)ఇతర గ్యాలరీలు