తెలుగు న్యూస్ / ఫోటో /
6 Reasons We May Fear Love : ప్రేమించడానికి భయపడతున్నారా? అయితే కారణాలు ఇవే..
- 6 Reasons We May Fear Love : ప్రేమ, వ్యక్తితో సాన్నిహిత్యం ఎక్కువైతే కొందరు భయపడతారు. దీనివెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొత్త సంబంధంతో వచ్చే వ్యక్తుల తమకు లేదా.. తమ వల్ల వారికి ఇబ్బందులుంటాయని చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ భయంపై సైకోథెరపిస్ట్లు ఏమి చెప్తున్నారంటే..
- 6 Reasons We May Fear Love : ప్రేమ, వ్యక్తితో సాన్నిహిత్యం ఎక్కువైతే కొందరు భయపడతారు. దీనివెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొత్త సంబంధంతో వచ్చే వ్యక్తుల తమకు లేదా.. తమ వల్ల వారికి ఇబ్బందులుంటాయని చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ భయంపై సైకోథెరపిస్ట్లు ఏమి చెప్తున్నారంటే..
(1 / 7)
ప్రపంచంలోని అత్యంత అందమైన భావాలలో ప్రేమ ఒకటి. ఇది మనకు బలమైన అనుభూతిని కలిగిస్తుంది. మనం ఇష్టపడేవారికి మన వల్ల హాని కలుగుతుందని భావించేలా చేస్తుంది. దీనివల్ల ఓ వ్యక్తికి దగ్గరవుతున్నా మనలో భయం ఎక్కువ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రేమలో పడడానకిి, రిలేషన్లోకి వెళ్లడానికి కొందరు ఎందుకు భయపడతారు? వంటి విషయాలపై సైకోథెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ పలు కారణాలు వెల్లడించారు. (Pexels)
(2 / 7)
తమ చుట్టూ ఉన్నవారిని చూసి.. లేదా ప్రేమ వల్ల కలిగే మార్పులు తమను గాయపరుస్తాయని భావించి.. ప్రేమలో పడితే అంతా బాధే మిగులుతుందని చాలా మంది భావిస్తారు. గతంలో చూసినా లేదా అనుభవించిన నొప్పినే.. ఇప్పుడు ఈ సంబంధం కూడా ఇస్తుందేమోనని భయపడతారు. (Pexels)
(3 / 7)
ప్రేమలో పడితే చాలా ప్రమాదం ఉంటుందని.. కొన్నిసార్లు తమ వల్ల తమను ఇష్టపడేవారికి హాని జరుగుతుందేమోనని భయపడతారు. అందుకే కొందరు ప్రేమంటే భయపడతారు. (Pexels)
(4 / 7)
ఈ భయాలు స్పృహతో లేదా అపస్మారకంగా ఓ మనిషిలోపల అంతర్గతంగా ఉండడం వల్ల.. వారు తిరిగి ప్రేమలోకి వెళ్లలేరు. అలాంటివారిని స్పృహలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. తద్వారా వారు తమ భయాలను జయిస్తారు. నిజమైన ప్రేమను పొందుతారని సైకో థెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ తెలిపారు. (Pexels)
(5 / 7)
మనలో చాలా మంది ఇంట్లో తమ ప్రేమను అంగీకరించరనే భయంతో.. కనీసం ప్రేమించనవారికి తమ ప్రేమను కూడా వ్యక్తం చేయరు. ఇది కూడా కొందరికి ప్రేమను దూరం చేస్తుంది. (Pexels)
(6 / 7)
ఒక వేళ ధైర్యం చేసి ప్రేమించినా.. పెద్దలతో విడిపోవాల్సి వస్తుందేమోననే భయం, ప్రేమించిన వ్యక్తి పెళ్లి తర్వాత సరిగ్గా చూసుకుంటారో లేదో అనే భయాలు కూడా ప్రేమను దూరం చేస్తున్నాయని సైకోథెరపిస్ట్ తెలిపారు. (Pexels)
ఇతర గ్యాలరీలు