5 most popular SUVs: 2022లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీలు ఇవే!
5 most popular SUVs: 2022లో ఎస్‍యూవీ సెగ్మెంట్‍లో కార్ల అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా కొన్ని మోడల్స్ ఆధిపత్యం చెలాయించాయి. సంవత్సరమంతా సేల్స్‌లో దుమ్మురేపాయి. టాటా నెక్సాన్ నుంచి హ్యుండాయ్ వెన్యూ వరకు కొన్ని మోడల్స్ దూసుకెళ్లాయి. అలా 2022లో ఎక్కువగా అమ్ముడైన టాప్-5 ఎస్‍యూవీలు ఇవే.
(1 / 5)
2022లో టాటా నెక్సాన్ అదరగొట్టింది. గతేడాది టాటా నెక్సాన్ 1,56,225 యూనిట్లను టాటా మోటార్స్ విక్రయించింది. ఇవి 2022 జనవరి నుంచి నవంబర్ వరకు గణాంకాలు. డిసెంబర్ గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే 2022లో టాప్ సెల్లింగ్ ఎస్‍యూవీగా నెక్సాన్ నిలువడం పక్కా. (Tata Motors)
(2 / 5)
పోటీ తీవ్రంగా ఉన్నా 2022లో వినియోగదారుల మనసులను గెలిచింది హ్యుండాయ్ క్రెటా. 2022 జనవరి నుంచి నవంబర్ వరకు క్రెటా ఎస్‍యూవీకి చెందిన 1,30,690 యూనిట్లు ఇండియాలో అమ్ముడయ్యాయి. (Hyundai)
(3 / 5)
పాత విటారా బ్రెజాను రిప్లేస్ చేస్తూ 2022లో మారుతీ బ్రెజా లాంచ్ అయింది. 2022లో 1,19,363 మారుతీ బ్రెజా యూనిట్లు అమ్ముడయ్యాయి. పోటీని గట్టిగా తట్టుకొని మంచి సేల్స్ సాధించింది ఈ మోడల్. (Maruti Suzuki India)
(4 / 5)
2022 జనవరి నుంచి నవంబర్ వరకు ఇండియాలో టాటా పంచ్ మంచి ప్రదర్శన చేసింది. మొత్తంగా ఈ కాలంలో 1,19,309 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రతీ నెల సగటున 11వేలు సేల్ అయ్యాయి. 2023లో దీని అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. (Tata Motors)
ఇతర గ్యాలరీలు