HYDRAA : హైడ్రాకు 100 రోజులు - ఇప్పటివరకు ఏం చేసిందంటే..?-100 days for hydra formation in telangana important points check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hydraa : హైడ్రాకు 100 రోజులు - ఇప్పటివరకు ఏం చేసిందంటే..?

HYDRAA : హైడ్రాకు 100 రోజులు - ఇప్పటివరకు ఏం చేసిందంటే..?

Oct 26, 2024, 02:00 PM IST Maheshwaram Mahendra Chary
Oct 26, 2024, 02:00 PM , IST

  • HYDRAA : హైడ్రా ఏర్పాటు చేసి నేటికి వంద రోజులు అవుతోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న GO 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 120 ఎకరాల భూమిని ప్రభుత్వానికి హైడ్రా అప్పగించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడండి… 

భాగ్యనగరం పరిధిలోని చెరువులు, నాలాల రక్షణే ప్రధాన ధ్యేయంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిదే. ఈ హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ఇటీవలే రాష్ట్ర సర్కార్​ ఆర్డినెన్స్‌ కూడా తీసుకొచ్చింది.

(1 / 6)

 హైడ్రా ఏర్పాటు చేసి నేటికి(అక్టోబర్ 26) వంద రోజులు అవుతోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న GO 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు. 

(2 / 6)

జులై 26 నుంచి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.  120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. 

(3 / 6)

తాజాగా హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని అధికారాలను కట్టబెట్టింది. జీహెచ్ ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు మొదలైన పబ్లిక్ ఆస్తలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా రక్షించనుంది.

(4 / 6)

తాజా అధికారాల ప్రకారం… ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఇకపై హైడ్రా నోటిసులు జారీ చేయనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేస్తే… హైడ్రాకు సంపూర్ణ అధికారాలు దక్కుతాయి. 

(5 / 6)

హైడ్రా ఏర్పాటు జీవో 99తో పాటు చర్యలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై ఇటీవలే విచారించిన న్యాయస్థానం… హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో హైడ్రా మరింత దూకుడు పెంచనుంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు