Vidya Saarathi Portal | విద్యాసారథి.. కంపెనీలు స్కాలర్‌షిప్ అందించే పోర్టల్
Vidya Saarathi Portal.. ప్రయివేటు కంపెనీలు అందించే స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యాసారథి పోర్టల్ వీలు కల్పిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం 2015–16 ప్రధాన మంత్రి విద్యా లక్ష్మి కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యా రుణాలు, విద్యాసారథి పోర్టల్ ద్వారా స్కాలర్‌షిప్పుల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యాసారథి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌ఎస్‌డీఎల్ ఈ–గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐదో తరగతి చదువుతున్న వారి నుంచి పీజీ వరకు ఎవరైనా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ముందుగా విద్యాసారథి పోర్టల్‌లో సైనప్ చేయాలి. మీ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తదితర వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న తరువాత లాగిన్ అవ్వాలి. పోర్టల్‌లోకి ఎంటర్ అయిన తరువాత మీ ప్రొఫైల్ వివరాలు నింపాలి.
ఇందులో మీ విద్యార్హతలు, ప్రస్తుతం చదువుతున్న కోర్సు, కుటుంబ ఆదాయం, చిరునామా, బ్యాంకు ఖాతా నెంబర్, తదితర వివరాలన్నీ నింపాలి.
ప్రొఫైల్ నింపిన తరువాత అప్లై ఫర్ స్కాలర్‌షిప్ అనే బటన్ క్లిక్ చేయాలి. అందులో మీరు అర్హులైన స్కాలర్‌షిప్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ మీరు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.
డాష్‌బోర్డులో మీరు అప్లై చేసిన స్కాలర్‌షిప్ వివరాలు, ప్రస్తుత స్టేటస్ వంటి వివరాలన్నీ కనిపిస్తాయి.
స్కాలర్‌షిప్ ఎవరు ఇస్తారు?
ఏసీసీ సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్, ఎస్‌ఎఎన్‌ఎల్ బేరింగ్స్ లిమిటెడ్, ఎన్‌ఎస్‌డీఎల్ తదితర సంస్థలు స్కాలర్‌షిప్ అందిస్తున్నాయి.
మరిన్ని కంపెనీలు కూడా ఈ పోర్టల్ ద్వారా ముందు ముందు స్కాలర్‌షిప్‌లు అందించే అవకాశం ఉంది.
కొన్ని కంపెనీలు తమ తమ బ్రాంచీలు, ప్లాంట్లు ఉన్న చోట స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
సంబంధిత కథనం